ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మరో ఐదుగురికి కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది.దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచారు. మరోవైపు సచివాలయంలోని వివిధ బ్లాకులను శానిటైజ్ చేయిస్తున్నారు.
Read More »TimeLine Layout
June, 2020
-
7 June
కరోనా ఆసుపత్రిగా నిమ్స్
తెలంగాణలో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవడం మొదలైనప్పటినుండి, అంటే దాదాపుగా మూడునెలలుగా గాంధీ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మరెక్కడా చికిత్స లేకపోవడం, కేవలం గాంధీ మాత్రమే అందుబాటులో ఉండడం అన్ని వెరసి వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ ను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ రెండు వందల పడకలను …
Read More » -
7 June
కార్యకర్త కుటుంబానికి మంత్రి హరీశ్ బీమా అందజేత
టీఆర్‌ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తకు, కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన పోతరాజు అఖిల్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో మృతుడికి ప్రమాద బీమా వర్తించింది. ఇందుకు సంబంధించి రూ. 2 లక్షల చెక్కును మంత్రి హరీశ్ నేడు మృతుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా …
Read More » -
5 June
మీరా చోప్రా ఫిర్యాదు…మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!!
సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల సమస్యపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనపై అసభ్యకర కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారని మీరా చోప్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళింది. తన ట్వీట్‌లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నానని మీరా చోప్రా …
Read More » -
5 June
పాముల పార్కు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ఆయన …
Read More » -
5 June
జూన్ 8 నుంచి భక్తులకు దర్శనాలు..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తెలంగాణలోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తుల దర్శనాలకు ఆలయాలు తెరిచే విషయమై శుక్రవారం అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్‌ఓపి)ను అధికారులతో చర్చించారు. భక్తులకు …
Read More » -
3 June
ఏటా నియంత్రితసాగు అలవాటుగా మారాలి..సీఎం కేసీఆర్
మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల …
Read More » -
3 June
నిమ్స్ దవఖానా సిబ్బందికి కరోనా..!
హైదరాబాద్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 12 మంది పీజీ విద్యార్థులకు కరోనా వైరస్ బారినపడగా తాజాగా నిమ్స్ కు చెందిన నలుగురు డాక్టర్లు ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బంది కొవిడ్-19 లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేసినట్లు నిమ్స్ …
Read More » -
3 June
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..!!
విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రప్రభుత్వం కోరిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆందోళన తెలుపుతూ లేఖ …
Read More » -
3 June
మంత్రి కేటీఆర్‌కు రూ.2 లక్షల చెక్కు అందజేత
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాని ఎదుర్కోవడంలో చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా సాయంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ మందడి లక్ష్మీనరసింహ రెడ్డి ఇటీవల తనకు అందించిన రూ.2 లక్షల విరాళం చెక్కుని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తో కలిసి మాసబ్ ట్యాంక్ లోని MA & UD కార్యాలయం లో బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, …
Read More »