బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కర్నూల్ రాజకీయాల్లో ఈయనో సంచలనం.కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఈ యువనేత గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి విజయంలో కీలకపాత్ర పోషించారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే సిద్ధార్థ రెడ్డి. మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్‌లో మాస్ లీడర్‌గా పేరొందారు బైరెడ్డి. ఈ యువనేతను గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ …
Read More »TimeLine Layout
October, 2019
-
13 October
నా కత్తి గొప్పదా.. నీ తుపాకి గొప్పదా..పండక్కి తేల్చుకుందాం !
ఈ సంక్రాతికి సమరం సిద్దమైంది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మహేష్ ఫ్యాన్స్ ఎవరూ తగ్గేట్టుగా కనిపించడంలేదు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉందిగాని ఇక్కడే …
Read More » -
13 October
ఏడాదికో మాటే చెప్తే నమ్మడానికి ప్రజలేం వెర్రోళ్లు కాదు బాబూ..!
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రోజురోజుకి దిగజారిపోతున్నారు. రోజుకో మాట మాట్లాడుతూ జనాల ముందు నవ్వులపాలు అవుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడే మాటలకి చూసుకుంటే చంద్రబాబుకి ఇలాంటి కోణం ఒకటి ఉందా అని అర్ధమవుతుంది. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. “మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన …
Read More » -
12 October
ఆర్టీసీ విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదు.. మంత్రి వేముల
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు అక్కడ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఇక్కడ మాత్రం ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదన్నారు. ప్రభుత్వ …
Read More » -
12 October
కడప జిల్లా ఎస్పీ గా అన్బురాజన్..వారి గుండెళ్లో రైళ్లే
కడప జిల్లా నూతన ఎస్పీ గా అన్బురాజన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తానని, సమస్య ఏదైనా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మరింత …
Read More » -
12 October
ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి సీఎం జగన్ కి బహుమతిగా ఇస్తాం..వైసీపీ మంత్రి
విశాఖ పశ్చిమనియోజక వర్గపర్యటనలో భాగంగా ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఐటీఐ జంక్షన్ వద్ద రూ. 60లక్షల వ్యయముతో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణం, స్మశాన వాటికలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని.. భారీ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తామని పర్యాటక శాఖ …
Read More » -
12 October
ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయం..మంత్రి పువ్వాడ
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తుందని వార్తలు వచ్చాయి. కాగా, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి పువ్వాడ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీని కాపాడుకుంటామని.. ప్రైవేటుపరం చేయమని స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..’ఆర్టీసీని …
Read More » -
12 October
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక.. టీఆర్‌ఎస్ భారీ విజయం ఖాయం..కేటీఆర్
ఈ నెల 21 న జరగనున్న హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇంచార్జీలు, సీనియర్ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో జరుగుతున్న ప్రచారం తీరును ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు ఇంటింటి ప్రచారం ఉధృతం చేయాలని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే హుజూర్‌నగర్ …
Read More » -
12 October
సానియా మీర్జా వీడియో వైరల్..బిడ్డ పుట్టిన తర్వాత కూడ ఎలా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ బరిలో పునరాగమనం చేస్తోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో కొనసాగిన సానియా అనేక టైటిళ్లు గెలిచి ర్యాంకింగ్ లో టాప్ కి చేరింది. అయితే, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం పూర్వపు ఆరోగ్యం పుంజుకున్న సానియా మరోసారి ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ బాట పట్టింది. గత కొన్నిరోజులుగా …
Read More » -
12 October
ఆర్టీసీ సమ్మె..సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!
మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని …
Read More »