TimeLine Layout

September, 2019

  • 23 September

    బాహుబలి లేకుంటే సైరా లేదు…మెగాస్టార్ చిరు సెన్సేషనల్ కామెంట్స్…!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం “సైరా”. అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా టీజర్ సంచలనం రేపుతోంది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌ప్టెక్టేషన్స్ పెరిగిపోయాయి. బ్రిటీష్‌ వారిపై పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై రూపొందించిన చిత్రమే. సైరా. ఈ చిత్రానికి మెగాపవర్‌స్టార్ రాంచరణ్ నిర్మాతగా …

    Read More »
  • 23 September

    అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌‌ కింద ప్రమాదం..యువతి మృతి..!

    అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదంలో ఓ యువతి మరణించింది. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసిన సమయంలో పై నుంచి పెచ్చులు ఊడి..ఆ సమయంలో అక్కడే ఉన్న మౌనిక అనే యువతిపై పడ్డాయి. శకలాలు పడడంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ ప్రమాదంపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో, అత్యంత పకడ్బందీగా …

    Read More »
  • 22 September

    విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌..కిడారిని చంపిన మావోయిస్టు అగ్రనాయకురాలు అరుణ హతం

    మావోయిస్టు వారోత్సవాల సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు, అరుణ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈస్ట్‌జోన్‌కు వచ్చిన అరుణ గతకొంత కాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను …

    Read More »
  • 22 September

    సీఎం జగన్ని ప్రశ్నించిన ప్రత్తిపాటి పుల్లారావు

    నాలుగు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ విధానంతో కాంట్రాక్టర్లను మార్చితే ప్రాజెక్టుల భద్రత ఎవరు చూస్తారు? అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి ఆదా చేస్తున్నామని చెబుతూ కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ప్రజలపై అదనపు భారం పడుతుందని అన్నారు.

    Read More »
  • 22 September

    రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

    పరిస్థితి ఏదైనా ప్రజాసేవే ముఖ్యమనుకున్నారు. చదువుకున్న దానికి, తాను నిర్వర్తించిన వృత్తికి న్యాయం చేశారు. అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే చికిత్స చేశారు. ఆమే డాక్టర్ ఎం శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే వివరాల్లోకి వెళ్తే.. …

    Read More »
  • 22 September

    పున‌ర్న‌విపై సంచలనమైన కామెంట్స్ చేసిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌…వీడియో వైరల్

    తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఈ వారం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున.తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో త‌న‌దైన స్టైల్లో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో క‌లిసి సంద‌డి చేశారు. ఈ ప్రొమో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఎందుకంటే శ్రీముఖి వ‌రుణ్ తేజ్ కు ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు అంద‌రూ చూస్తున్నారంటూ ఫన్ని …

    Read More »
  • 22 September

    పక్కా సమచారం..ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయిందే

    తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. బిగ్‌బాస్‌ తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్‌ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్‌ ప్రక్రియను చేపట్టి బిగ్‌బాస్‌ అంటే ఏంటో నిరూపించాడు. నామినేషన్‌లో ఉన్నదే ముగ్గురు అయితే అందులో డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. పైగా దీనికి తగ్గట్టు రిలీజ్‌ చేసిన ప్రోమోలో కొన్ని వివరాలు వెల్లడయ్యేలా దాన్ని కట్‌ చేశాడు. అయితే …

    Read More »
  • 22 September

    కోడెల కాల్‌డేటా…ఆత్మహత్యకు గంట వ్యవధిలో 12 మందితో

    టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ప్రధానంగా ఫోన్‌కాల్‌ డేటాపై దృష్టి సారించారు. సూసైడ్‌ నోట్‌ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. కీలక ఆధారంగా మారిన ఆయన సెల్‌ఫోన్‌ అదృశ్యం కావడంతో కాల్‌డేటాను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ పోలీసులు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు. చని పోవడానికి ముందు …

    Read More »
  • 22 September

    ఏపీ సచివాలయ పరీక్షల్లో ఎన్నివేల మందికి సున్నా మార్కులు వచ్చాయో తెలుసా..!

    ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాల(మార్కులు)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రామ సచివాలయ పరీక్షల్లో 2478 మంది అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చాయి.మరికొందరికి సున్నా కంటే తక్కువగా మైనస్‌లలో మార్కులు వచ్చాయి. పరీక్షలో నెగటివ్ మార్క్స్ ఉండటంతో ఇలా వేల మందికి సున్నా మార్కులు వచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క …

    Read More »
  • 22 September

    తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం.

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు. అభివృద్ధి కోసమే అప్పులు చేసినం… అవసరమైతే ఇంకా తెస్తాం. …. 40 ఏండ్లలో ఎస్‌ఎల్‌బీసీ ఇంకా పూర్తి కాలేదు. మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చిస్తాం. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat