TimeLine Layout

August, 2019

  • 11 August

    దర్శకుడు కె.విశ్వనాథ్‌ ను కలిసిన సీఎం కేసీఆర్‌

    ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కాసినాథుని విశ్వనాథ్(89) ను సీఎం కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఫిల్మింనగర్‌ లోని ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్యం విషయం తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.

    Read More »
  • 11 August

    ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటా..జక్కంపూడి రాజా

    కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత కాపు కార్పొరేషన్‌ ఎండీ హరీంద్రప్రసాద్‌ ప్రమాణం చేయించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్ తమ కుటుంబాన్ని వెన్నంటి ఆదుకున్నారని రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మమ్మల్ని ఆదుకున్న వైఎస్‌ జగన్, నన్ను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలవల్లే నాకీ పదవి లభించింది. …

    Read More »
  • 11 August

    సీఎం కేసీఆర్‌ విధానాలు దేశానికే ఆదర్శం..!!

    సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. నాగార్జున్‌ సాగర్‌ జలాశయం కుడి కాల్వ నుంచి మంత్రి జగదీశ్‌ రెడ్డి నీటిని విడుదల చేశారు. సాగర్‌ ఎడమ కాలువ నుంచి ఏపీ మంత్రి అనీల్‌ కుమార్‌ యాదవ్ నీటిని దిగువకు వదిలారు. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అక్కపల్లి ఏఎంఆర్‌పీ ప్రధాన కాలువ ద్వారా తెలంగాణ, ఏపీ మంత్రులు నీటిని విడుదల చేశారు.  సీఎం …

    Read More »
  • 11 August

    ఫేస్‌బుక్ లో మరో కొత్త ఫీచర్‌..ఉచితంగానే

    వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతున్న ఫేస్‌బుక్‌.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సామాజిక మాధ్యమాల వాడకం విరివిగా పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందంచే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. దీనికోసం ఫేస్‌బుక్‌లోని ప్రధాన ఫీచర్లు న్యూస్‌ఫీడ్‌, మెస్సెంజర్‌, వాచ్‌తో పాటు న్యూస్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ని జతచేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో మార్క్‌ …

    Read More »
  • 11 August

    శ్రీశైలం అందాలను ట్వీట్ చేసిన కేటీఆర్‌

    కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జూరాల నుంచి శ్రీశైలానికి 6,61,760 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు 5,65,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది. దీంతో …

    Read More »
  • 11 August

    కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం

    ఎన్నో దశాబ్దాలుగా తరచూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం నెలకొన్నది. ఈ నీటి సంవత్సరంలో మొదటి రెండు నెలలపాటు తీవ్ర నిరాశకు గురిచేసిన కృష్ణమ్మ.. ఇప్పుడు అనూహ్యంగా అంచనాలకు మించి జలకళను తీసుకొచ్చింది. కృష్ణాబేసిన్ చరిత్రను పరిశీలిస్తే.. ప్రధానంగా ఆగస్టు మాసం ప్రాజెక్టులకు కీలకంగా మారుతున్నది. గత 28 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆగస్టు నెలలో 500 టీఎంసీలకు పైగా వరద వచ్చిన సందర్భాలు కేవలం …

    Read More »
  • 11 August

    శాంతించిన గోదావరి..!

    తూర్పుగోదావరి జిల్లాలో వరద గోదావరి శాంతించిది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 13.30 అడుగులకు వరద నీటిమట్టం తగ్గింది. ఉదయం 5 గంటలకే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. మరో అడుగున్నర తగ్గితే 10 గంటల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక ను ఉపహంరించే అవకాశాలున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 12 లక్షల 40వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది. బ్యారేజ్ లోని 175 గేట్లను ఇంకా పూర్తిగా ఎత్తిఉంచారు. …

    Read More »
  • 11 August

    చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే..!

    ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వాతావరణం చల్లగా ఉంది.. ఇలాంటి స్థితిలో వేడి వేడిగా.. కమ్మగా.. చేపల పులుసు చేసుకుని తింటే.. ఎంత మజాగా ఉంటుందో తెలుసు కదా.. చేపల పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. అయితే ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. …

    Read More »
  • 11 August

    పసుపు బోర్డుపై బీజేపీ కొత్త నాటకం..!

    తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నల చిరకాల వాంఛ పసుపు బోర్డు డిమాండ్‌ను నీరు గార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను కొనసాగిస్తున్నదని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు అవసరం లేదని రైతులతోనే అనిపించేలా ప్రణాళికలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఢిల్లీలో సమావేశం పేరిట ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కుతంత్రం మరువక ముందే.. తాజాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధనా …

    Read More »
  • 11 August

    యువనేత కేటీఆర్ ఉదారత..!

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి కోసం సౌదీ అరేబియాలో వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన బూడిద పోచయ్య(50) ఆరునెలల క్రితం మరణించగా.. యువనేత కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఆయన మృతదేహం నిన్న శనివారం స్వగ్రామానికి చేరింది. బూడిద పోచయ్య 25 ఏండ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. రెండేండ్లకోసారి స్వగ్రామానికి వచ్చి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat