TimeLine Layout

July, 2019

  • 12 July

    నిరుద్యోగ యువతకు టీసర్కారు గుడ్ న్యూస్

    తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రంలో గురుకులాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి సర్కారు పచ్చ జెండా ఊపింది. దీంతో రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఉన్న 1698ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతులు జారీ చేసింది. గురుకులాల్లో ఉన్న 1071 టీజీటీ,119పీఈటీతో పాటుగా ముప్పై ఆరు ప్రిన్సిపల్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ …

    Read More »
  • 12 July

    వైఎస్ జగన్ పేరు మీద రెండు పథకాలు..!

    ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారుతండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి కృషి చేస్తున్న జగన్.. దివంగత సీఎం వైఎస్ పేరును ప్రధాన పథకాలకు పెట్టారు. బడ్జెట్లో రెండు పథకాలకు జగన్ పేరు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న సంక్రాతి కానుక, చంద్రన్న బీమా, చంద్రన్న చేయూత తదితర పథకాలకు నాటి సీఎం పేరు పెట్టినట్టుగానే.. జగన్ సర్కారు రెండు పథకాలకు జగనన్న …

    Read More »
  • 12 July

    కాపుల సంక్షేమానికి భారీగా నిధులు..!

    ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాపులకు ఇచ్చిన మాట ప్రకారం వారి సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. కాపుల సంక్షేమానికి రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. అలాగే, అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్లు, వైఎస్సార్‌ బీమాకు రూ.404 కోట్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి 400 కోట్లు, నాయిబ్రాహ్మణులు, రజకులు, ట్రైలర్ల సంక్షేమానికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్టు …

    Read More »
  • 12 July

    తిరుమల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన.. ఎవి.ధర్మారెడ్డి

    తిరుమల తిరుపతి దేవస్థానముల తిరుమల ప్రత్యేకాధికారిగా ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల ఇన్‌చార్జ్‌ జెఈఓ పి.బసంత్‌ కుమార్‌ రంగ నాయకుల మండపంలో తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగించారు. అనంతరం ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్వామివారి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి …

    Read More »
  • 12 July

    అన్నింటికీ ‘ఆధార్‌’ లింక్..లేదంటే పాన్‌ డీయాక్టివేషన్!

    పాన్‌-ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. అలా ఆగస్టు 31 లోపల అనుసంధానం చేయకుంటే పాన్‌ను చెల్లనిదిగా గుర్తిస్తారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఆదాయం పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్‌కు ఇకపై పాన్‌కు బదులు ఆధార్‌ను ఉపయోగించొచ్చని ఇటీవల బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కోసం పాన్ కార్డు లేదా ఆధార్.. …

    Read More »
  • 12 July

    బ్రేకింగ్ న్యూస్… విజయమ్మకు భూమా అఖిలప్రియ ఫోన్..జగన్ అన్నకు క్షమాపణలు చెప్తాం

    కర్నూలు జిల్లాలో రాజకీయాలను శాసించిన నేతలు భూమా నాగిరెడ్డి – శోభా నాగిరెడ్డి. వీరిద్దరూ ఇపుడు లేరు. దీంతో వీరి వారసులుగా భూమా అఖిల ప్రియా రెడ్డి, భూమా బ్రహ్మానంద రెడ్డిలు రాజకీయాల్లో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ… తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చిన అఖిలప్రియ… …

    Read More »
  • 12 July

    ఇది ఫిష్ మార్కెట్టా…! టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం

    టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో  విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో  సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. ఈ సమయంలో  స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు.శుక్రవారం నాడు వడ్డీ రాయితీ లేని అప్పుల విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో  స్పీకర్  తమ్మినేని సీతారాం …

    Read More »
  • 12 July

    ఏపీ బడ్జెట్ తండ్రి బాటలో వైఎస్ జగన్..!

    ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్‌లో రూ.11,399 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ ఆ పేరు వింటేనే పేదవాడి మొహంపై చిరునవ్వు కనిపిస్తుంది. వారికి ఆరోగ్య భద్రత కల్పించి, కార్పొరేట్ వైద్యాన్ని వారికి చేరువ చేసిన ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి ఈ పథకం ప్రధాన కారణం కూడా. …

    Read More »
  • 12 July

    రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు ప్రభుత్వం కృషి చేస్తుంది..బుగ్గన

    ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని రాష్ట్రాన్ని విభజించారని ఆయన గుర్తు చేశారు. రాజధాని లేకుండా విభజనకు గురైన రాష్ట్రం ఏపీ రాష్ట్రమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు …

    Read More »
  • 12 July

    కర్ణాటక రాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్ట్..!

    కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు తుది నిర్ణయం తీసుకోరాదంటూ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat