హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కళాశాలలో హరితహారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రోజారాణి తో పాటు 500 మంది విద్యార్థినులు, అటవీశాఖ అధికారులు పాల్గొని కళాశాల ఆవరణలో భారీగా మొక్కలు నాటారు. అందరూ కలిసి సుమారు ఆరు వందల మొక్కలు నాటి, సంరక్షణ కోసం ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకున్నారు. విద్యార్థినులు మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిలో ఉండాలని ప్రిన్సిపాల్ రోజారాణి సూచించారు. …
Read More »TimeLine Layout
July, 2019
-
10 July
బీజేపీలో ఏపీ టీడీపీ విలీనం..!
ఏపీలో అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.టివి 9 చానల్ తో ఆయన మాట్లాడారు. త్వరలో బిజెపిలో టిడిపి విలీనం అయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారని ఆ చానల్ లో వార్త వచ్చింది. మళ్లీ తాము బిజెపితో కలుస్తామని, తామే బిజెపితో తాళి కట్టించుకుంటామని ఆయన అన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండురోజుల అనంతపురం జిల్లా పర్యటన చేసిన సయమంలోనే …
Read More » -
10 July
టిన్ పిన్ బౌలింగ్ క్రీడ కు తగిన ప్రోత్సాహకం అందిస్తాం..!!
రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ క్రీడ కు తగిన ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో తెలంగాణ టిన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ లోగో ను మంత్రి శ్రీనివాస్ గౌడ్,చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ క్రీడకు విశేష ప్రాచుర్యం …
Read More » -
10 July
చింతమడక గ్రామానికి రూ.10కోట్లు విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రూ.10కోట్లు మంజూరు చేసింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమడక గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి రూ.10కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ చింతమడకకు …
Read More » -
10 July
టీడీపీకి షాక్ న్యూస్..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ ప్రకటించారని వార్త వచ్చింది. పాతికేళ్లుగా తాను పార్టీలో ఉన్నానని, ఇంతకాలం తనను ప్రోత్సహించినవారికి , ఆదరించినవారికి దన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఆత్మ ప్రబోధానుసారమే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సతీశ్ ప్రకటించారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారు?భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది …
Read More » -
10 July
4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల విఆర్ ఓ అంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడని తెలిసింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ …
Read More » -
10 July
వివాదంలో మహ్మద్ షమీ
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం.. గతంలో షమీ స్త్రీలోలుడని ,చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు అని షమీ వైఫ్ హసీనా ఆరోపించిన సంగతి విదితమే. అయితే తాజాగా సోఫియా అనే మహిళా షమీ తనతో నిత్యం చాటింగ్ చేశాడని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో 1.4మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఒక గొప్ప క్రికెటర్ నాకే ఎందుకు మెసె చేస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా అని సోఫియా …
Read More » -
10 July
ఖాతాదారులకు SBI శుభవార్త
దేశంలో ఎస్బీఐ తమ ఖాతాదారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో ఎంసీఎల్ఆర్ రుణరేట్లను 0.05% తగ్గింపు నేటి నుంచే అమలుల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఆర్బీఐ కీలక రెపో రేట్లు తగ్గింపు కారణంగా ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గించింది. ఇకపోతే ఎస్బీఐ డిపాజిట్లు విలువ రూ.29లక్షల కోట్లు కాగా.. హోమ్ లోన్స్ ,వాహన రుణాల్లో ఈ బ్యాంకుకు 35% …
Read More » -
10 July
హాస్పిటల్ లో రోగుల దూదిని దొంగిలించిన మీరా సీఎంను విమర్శించేదంటూ కౌంటరిచ్చిన వైసీపీ
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరుజిల్లా టీడీపీ కార్యాలయంలో కోడెల మాట్లాడారు. జగన్ కు చంద్రబాబు ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని, ప్రజావేదిక కూల్చివేసి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్నారని కోడెల వ్యాఖ్యానించారు. జగన్ నుంచి ప్రజలు చాలా ఆశించారని, కానీ జగన్ ఏం చేయట్లేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులను ఆపేశారని …
Read More » -
10 July
సుప్రీమ్ కోర్టుకు కర్ణాటక రాజకీయ సంక్షోభం
ప్రస్తుతం దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభం దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీమ్ కోర్టుకు చేరింది. సర్కారుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తమ రాజీనామాలను ఆమోదించకుండా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజ్యంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని వారంతా సీజేఐ ముందు ప్రస్తావించగా రేపు పిటిషన్ …
Read More »