ఈసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు సందడి చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున రాయలసీమ నుంచి ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి వైసీపీ తరఫున ఈ ఘనత సాధించారు. వారిలో సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయంల నుంచి, వెంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. సాయిప్రసాదరెడ్డి 2004లో కర్నూలు జిల్లా …
Read More »TimeLine Layout
May, 2019
-
30 May
కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లకపోవడానికి కారణం తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా అకస్మాత్తుగా వారి పర్యటన రద్దు అయ్యింది. మోడి ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ లకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళదాం అనుకున్నారు. కానీ వారి పర్యటన రద్దయ్యింది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ కి …
Read More » -
30 May
జగన్ విజయంపై శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆపార్టీ చీఫ్ థాకరే ఏమన్నారంటే.!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థ తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ను ‘విజయ వీరుడు’ అని శివసున అభివర్ణించింది. గురువారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది. సామ్నా సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాష్ట్రలో బిజెపి ఘోర పరాజయం మూటగట్టుకుందని థాకరే వ్యాఖ్యానించారు. అయితే …
Read More » -
30 May
నిజమైన అభిమానులు వైఎస్ కుటుంబానికే ఉన్నారు.. సునీల్ కల నెరవేరింది
ఒకాయన రాజశేఖరరెడ్డికి వీరాభిమాని.. ఆయన కొడుకు జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతవరకు పాదరక్షలు వేసుకోనని మొక్కుకున్నాడు… ఆయనే ఆదిలాబాద్‌కు చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన వ్రతం వీడారు. అనిల్‌కుమార్ తెలంగాణలోని అదిలాబాద్ కు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అనుభవించారు… దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమాని, వైఎస్ …
Read More » -
30 May
అప్పుడు జగన్ ని అలాచేసిన వాళ్లే ఇప్పుడు విషెస్ చెప్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలుపుతూ లేఖ రాసారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల అమలులో బాధ్యతాయుతమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని పేర్కొన్నారు.. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగన్ కు అభినందనలు తెలిపారు. వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More » -
30 May
భావోద్వేగంతో ఏడ్చిన తల్లి.. తనచేతితో కన్నీటిని తుడిచిన జగన్.. సభలో అందరిమనసుల్నీ హత్తుకున్న ఘటన
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని జగన్ దైవసాక్షిగా ప్రమాణం చేసారు. అయితే కుమారుడు గొప్ప స్థానానికి ఎదిగితే ఏ తల్లి అయినా ఎంతో సంతోషిస్తుంది. విజయమ్మ కూడా అలాగే సంతోషపడి …
Read More » -
30 May
తెలుగు తమ్ముళ్ళకి జగన్ స్వీట్ వార్నింగ్.ఏంటా వార్నింగ్..?
ఏపీ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజే తనదైన మార్కును కనబరచారు. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు వేదికకు చేరుకున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేత …
Read More » -
30 May
జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రాంగోపాల్ వర్మ
తన జీవితంలో మొట్టమొదటిసారి ఓ రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్జీవీ వెళ్లారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైసీపీకి ప్రజలు భారీగా కట్టంకట్టారన్నారు. జగన్ చారిత్రాక విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి …
Read More » -
30 May
మోడి ప్రమాణ స్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలు ఎందుకెళ్తున్నారంటే.?
దేశంలో సంచలన విజయం సాధించిన బీజేపీ మరోసారి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్రమోడి కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వారికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఫోన్‌కాల్స్ అందాయి. పిఎంఒ ఫోన్లు చేసిన వారిలో తెలంగాణనుంచి కిషన్ రెడ్డి, కర్ణాటకనుంచి సదానంద గౌడ ఉన్నారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, అనుప్రియ పటేల్, రాందాస్ అథావలే, మిత్రపక్ష నేత …
Read More » -
30 May
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లను జగన్ ఎందుకు ప్రస్తావించారో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ …
Read More »