TimeLine Layout

September, 2018

  • 13 September

    ఆంధ్రప్రదేశ్ లో పండగపూట పెను విషాదం..!

    ఇంట్లో కేబుల్‌ వైరు లాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో ఏసు(26), సాల్మన్‌ రాజు(5), ఎస్తేరు(3) వున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు తన కుటుంబంతో కలిసి బుధవారం బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి …

    Read More »
  • 13 September

    వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల..ఫ్యాన్స్ కు పండగే

     ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరుతో సినిమాగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి.రాఘవ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ‘యాత్ర’ చిత్రాన్ని వైఎస్‌ఆర్‌ తనయుడు, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. …

    Read More »
  • 13 September

    వినాయకుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలి..

    వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ శుభాకాంక్షలను ట్విటర్‌ ట్వీట్‌ చేశారు. అలాగే వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతితెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం …

    Read More »
  • 13 September

    ? వినాయక చతుర్థి విశిష్టత ?

    వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు … ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే … ఆయన అనుగ్రహాన్ని పొందవలసినదే. సాక్షాత్తు బ్రహ్మ దేవుడు సైతం తన సృష్టి రచనకి ముందు గణపతిని పూజించినట్టుగా ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటూ వుంటారు. పూర్వం గజముఖుడనే రాక్షసుడు పరమ శివుడిని తన తపస్సుచే మెప్పించి, …

    Read More »
  • 13 September

    వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే పుణ్యం, ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి

    మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు, పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తారు.వినాయక చవితి పండుగను జాతి, మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు.అయితే వినాయక చవితి కోసం వినాయకుడిని తీసుకొచ్చే సమయం అంటూ ఒకటి ఉంటుంది.ఆ సమయంలోనే గణేషుడిని తీసుకొస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మకం.మరి గణేషుడిని తీసుకొచ్చే …

    Read More »
  • 12 September

    తెలంగాణ ఎన్నికల ప్రక్రియ వేగవంతం

    ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల అధికారులు సిద్ధం అవుతున్నట్లు అందరికి తెలిసింది.తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు తెరపడింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి పీటీఐకి సూచనప్రాయంగా తెలిపారు. డిసెంబరు రెండో …

    Read More »
  • 12 September

    రైతు బంధువు ప్రభుత్వం కావాలా… రాబంధులు కావాలా

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎల్ రమణలు ఇద్దరు గడ్డపోళ్లు ఒక్కటయ్యారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. జగుస్సాకరమైన, నీచమైన ఆ రెండు పార్టీల కలయిక వల్ల ప్రజలకు ఒక సువర్ణావకాశం దొరికింది. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతిన్న వాళ్లు రావాలా….రైతు బంధువుగా మారిన ప్రభుత్వం రావాలో తేల్చుకునే సమయం వచ్చింది. …

    Read More »
  • 12 September

    ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

    నిరుద్యోగి ఆత్మహత్య…….విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన దుర్గారావు బీటెక్ చదువుకున్నాడు.ఉద్యోగ సాధన కోసం ఎక్కడికి వెళ్లిన పోటీ ఉండడం, ఎంత ప్రయత్నించిన ఉద్యోగం రాకపోవడంతో గత కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు.తీవ్ర మనస్తాపనికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని స్తానికులు ఆస్పత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతిచెందాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రైవేట్‌ …

    Read More »
  • 12 September

    అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకొని రేసు గుర్రంలా పరిగెడుతున్న నాయకుడు..కేసీఆర్‌

    రాజకీయంగా ప్రజలు తనను మరచిపోతున్న సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా నిలవాలని కోరారని, అందుకే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభాపతి సురేశ్‌ రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ… మళ్లీ టీఆర్ఎస్ లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అభివృద్ధి చేయాలనే స్పష్టమైన లక్ష్యం …

    Read More »
  • 12 September

    ట్రక్కు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయిన బైక్ ..మహిళ అదృష్టవంతురాలు

    చైనాలో ఓ మహిళ పెను ప్రమాదం బారిన పడి అదృష్టవశాత్తూ గాయాలు కాకుండా తప్పించుకుంది. ఈ సంఘటనను చూసిన చుట్టుపక్కల వారికి ఇది ఓ విచిత్రంలా తోచింది. చైనాకు చెందిన పీపుల్స్‌ డైలీ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మలుపు తిరుగుతుండగా.. అదే దిశలో మలుపు తీసుకుంటున్న ఓ భారీ ట్రక్కు ఆమెను వెనుక నుంచి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat