ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ కుటిల నీతిని ఎండగడుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటును మంగళవారం స్తంబింపజేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లోనూ తిరస్కరించటంతో వెల్‌లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని …
Read More »TimeLine Layout
April, 2022
-
6 April
మంత్రి కేటీఆర్‌తో కంటోన్మెంట్ ఆర్మీ అధికారుల భేటీ.. రోడ్ల మూసివేతపై చర్చ
హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్‌తో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. మెహిదీపట్నంలోని కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన వరద కాల్వ వంటి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీయల్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ గారు తెలిపారు. ఇందులో భాగంగా నగరం నలుదిక్కులా …
Read More » -
6 April
ఖమ్మం నియోజకవర్గం లోని ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు మంజూరు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఖమ్మం నియోజకవర్గం లోని ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు మంజూరు .రంజాన్ మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గం లోని మసీదుల మరమ్మతులకై మైనార్టీల అభివృద్ధికి అనునిత్యం తోడ్పడే మంత్రి పువ్వాడ మరోసారి ముస్లిం మైనార్టీలపై తనకున్న అపారమైన గౌరవాన్ని , అభిమానాన్ని చాటారు. ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు ఆర్థిక …
Read More » -
5 April
ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి భారీ విరాళం.. ఎంతో తెలిస్తే షాక్!
తాను ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణమై విద్యాసంస్థకు ఓ పూర్వవిద్యార్థి భారీ విరాళం అందించారు. ఐఐటీ కాన్పూర్‌లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం ఆ విద్యార్థి ముందుకొచ్చి తన వంతుగా రూ.100కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ పూర్వ విద్యార్థి ఎవరో కాదు ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్. ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు పూర్వవిద్యార్థి, ఇండిగో కో ఫౌండర్ …
Read More » -
5 April
టీఎస్ ఐపాస్‌తో రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తెలంగాణ ప్రభుత్వ అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నామని.. 15 రోజుల్లోనే కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు …
Read More » -
5 April
ఏపీలో మరో కొత్త జిల్లా?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాల్లో పాలన అమల్లోకి వచ్చింది. పలుచోట్ల ప్రజల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఒకట్రెండు చోట్ల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ …
Read More » -
5 April
గంటకు పైగా ప్రధాని మోడీ- సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభించిన కొత్త జిల్లాలు, ఇతర అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం నిధులు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై మోడీతో జగన్ చర్చించినట్లు సమాచారం. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై మోడీ దృష్టికి …
Read More » -
5 April
గుడిలో దొంగతనం.. ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోయాడు!
అమ్మవారి గుడిలో చోరీకి వెళ్లిన దొంగ అక్కడే ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ గుడి ఉంది. కంచిలి పట్టణానికి చెందిన పాపారావు అనే యువకుడు ఈ తెల్లవారిజామున దొంగతనానికి గుడి వద్దకు వెళ్లారు. గుడిలో ఓ కిటికీ నుంచి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి వెండి వస్తువులు తీసుకుని తిరిగి అదే కిటికీ నుంచి …
Read More » -
5 April
ఫేక్ న్యూస్ ప్రచారం.. ఆ యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 22 ఛానళ్లను బ్యాన్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రకటించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం గుర్తించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. న్యూస్ ఛానళ్ల తరహాల థంబ్ నె యిల్స్, లోగోస్ వాడుతూ వీక్షకులను సైడ్ …
Read More » -
5 April
తెలంగాణలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు: కేంద్ర మంత్రి తోమర్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య తగ్గినట్లు ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్‌సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రీతిలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆయన తెలిపారు. 2014 నుంచి 2020 నాటికి సగానికి పైగా అన్నదాతల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో 2014లో 898 మంది రైతులు చనిపోగా, 2020లో 466 మంది రైతులు ఆత్మహత్య …
Read More »