టీమిండియా పరుగుల యంత్రం…విరాట్ కోహ్లి ఇప్పటికి 98 టెస్టులు ఆడాడు. వెన్నునొప్పితో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఆ దేశంలో మూడో టెస్టు ఆడితే 99 మ్యాచ్ లు పూర్తవుతాయి. స్వదేశంలో శ్రీలంకతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 25న జరిగే మ్యాచ్లో కోహ్లికి వంద మ్యాచ్ లు పూర్తవుతాయి. అదే స్టేడియంలో 360 డిగ్రీస్ ఆటగాడు డివిలియర్స్ కూడా వందో టెస్టు ఆడాడు. ఇద్దరూ కూడా IPLలో బెంగళూరుకే …
Read More »TimeLine Layout
January, 2022
-
4 January
పవన్ కు అండగా మెగాస్టార్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా న్యాయం కోసమే మాట్లాడతాడని ఆయన సోదరుడు చిరంజీవి చెప్పాడు. తనలాగే పవన్ కూడా న్యాయం కోసం పోరాడుతాడని మెగా అభిమానులతో జరిగిన సమావేశంలో అన్నాడు. ‘మన సిన్సియారిటీ, మన నిజాయితీ, మన సంయమనం, మన ఓపిక.. ఇవే విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆ విషయంలో నేను ఎవరితో మాట అన్పించుకోలేదు’ అని చిరు తెలిపాడు.
Read More » -
4 January
రికార్డు బ్రేక్ చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’
సినిమా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. రూ.22.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఆ లక్ష్యాన్ని బ్రేక్ చేసి రూ. 2.07 కోట్ల లాభంతో ముందుకెళ్తుంది. గత 10 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 24.57 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.18.29కోట్లు, ROIలో రూ.2.80కోట్లు, ఓవర్సీస్లో రూ. 3.48కోట్లు …
Read More » -
4 January
Bollywood లోకి రష్మికా మందాన
ఇటీవల ‘పుష్ప’ ఇచ్చిన హిట్ తో మంచి జోష్ తో కనిపిస్తోంది రష్మిక. ఆమె ఇప్పుడు ‘మిషన్ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. కాగా.. “ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే చిత్రమిది’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
Read More » -
4 January
ఏపీ వ్యాప్తంగా 15-18 ఏళ్లున్న 5 లక్షల మందికి వ్యాక్సిన్లు
ఏపీ వ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా పంపిణీ నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు 5 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,146 మందికి వ్యాక్సిన్లు వేశారు.. తూ.గో, శ్రీకాకుళం, నెల్లూరు, ప.గో, కర్నూలు జిల్లాల్లో 40 వేల మందికి టీకా వేశారు. 28 రోజుల అనంతరం వీరికి రెండో డోసు టీకా వేయనుండగా.. దేశ వ్యాప్తంగా తొలిరోజు 41 లక్షల …
Read More » -
4 January
ఐసోలేషన్లో ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఐసోలేషన్లోకి వెళ్లారు. తన కుటుంబంలోని ఓ సభ్యుడితో పాటు ఆమె సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్న కారణంగా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా.. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
Read More » -
4 January
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కొవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ డా. ఎన్కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్వే అని చెప్పారు. గత ఏడాది DEC తొలి వారంలో మొదటి ఒక్రాన్ కేసును గుర్తించగా 2 వారాల్లోనే ఈ వేరియంట్ దేశమంతటా వ్యాపించిందని తెలిపారు. దీనిని బట్టి దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని చెప్పవచ్చన్నారు.
Read More » -
4 January
తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ..?విధిస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు ప్రసారమవుతున్నాయి.ఈ వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీచ్చారు.లాక్డౌన్ ప్రస్తుతం అవసరం లేదని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. ఒమిక్రాన్ పట్ల భయం వద్దని, అదే సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. అందరూ మాస్కు ధరించాలన్నారు. కాగా, విద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు …
Read More » -
4 January
ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. తాజాగా 103 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,278గా ఉంది.మొత్తం కేసులు – 20,77,608 .వీటిలో కోలుకున్న వారి సంఖ్య 20,61,832. మరణించిన వారి సంఖ్య – 14,498గా ఉంది.
Read More » -
4 January
తెలంగాణలో ఈనెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలో ఈనెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవుల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని సూచించింది.
Read More »