TimeLine Layout

January, 2022

  • 4 January

    హైదరాబాద్ నగరంలో కొత్తగా 294 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 294 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,47,235 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ‘ఒమిక్రాన్’ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. టీనేజర్స్ ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.

    Read More »
  • 4 January

    వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

    తెలంగాణలోకరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పడకలు, ఆక్సిజన్, మందులు, పరీక్ష కిట్లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఖాళీలు ఉంటే 15 రోజుల్లోగా భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ సూచించారు.

    Read More »
  • 4 January

    బరువు తగ్గడానికి అది కూడా చేయాలా..?

    చాలామంది బరువు తగ్గడానికి చపాతీలు తింటుంటారు. అయితే డైలీ ఇవి తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటి ప్లేస్లో సజ్జ రొట్టెలు చేర్చండి. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు. సజ్జ రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు …

    Read More »
  • 4 January

    ఇమ్యూనిటీ పెరగాలంటే..?

    శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఆహారంతో పాటు జ్యూస్లు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, టొమాటో, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, యాపిల్, బీట్రూట్, క్యారట్ జ్యూస్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్.. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి.

    Read More »
  • 3 January

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. అలనాటి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూశారు. 86ఏళ్ల PC రెడ్డి కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్నారు. నేడు చెన్నైలో తుదిశ్వాస విడిచిన ఆయన.. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దివంగత సీనియర్ నటులు ఎన్టీఆర్, ANR లతో పాటు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి లెజండరీ హీరోలతో సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలతో ఎక్కువుగా …

    Read More »
  • 3 January

    జొహానెస్ బర్గ్ లో టీమిండియాకు మంచి రికార్డు

    ఇటీవల జరిగిన సెంచూరియన్ లో టెస్ట్ మ్యాచు గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో కోహ్లి సేన రెండో టెస్టులో సౌతాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. టీమ్ ఇండియాకు మంచి రికార్డున్న జొహానెస్ బర్గ్ వేదికగా మ్యాచ్ మ.1.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా.. దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రోటీస్ చూస్తోంది. అయితే.. ఈ మ్యాచిక్కి వర్షం వల్ల …

    Read More »
  • 3 January

    వైస్ కెప్టెన్ గా బుమ్రా

    టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమిస్తారని అస్సలు ఊహించలేదని భారత మాజీ సెలెక్టర్, వికెట్ కీపర్ సబా కరీమ్ అన్నాడు. ‘ఈ విషయం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను. రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాను. అతడు మల్టీ ఫార్మాట్ ప్లేయర్. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ అద్భుతంగా రాణించాడు. పంత్కి కెప్టెన్సీపై అవగాహన ఉంది’ అని కరీమ్ …

    Read More »
  • 3 January

    YSRCP ప్రభుత్వానికి జనసేన సవాల్

    ఏపీలో పలు కారణాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు గడువిస్తున్నట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ లోపు ప్రభుత్వం స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయకుంటే.. సంక్రాంతి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతారని చెప్పారు. గుంటూరులో జరిగే ధర్నాలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. పల్నాడు ప్రాంతంలో 4లక్షల ఎకరాల్లో మిర్చి వేసిన రైతులు ఎకరాకు రూ.70 …

    Read More »
  • 3 January

    ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

    ఏపీ అధికార వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం. 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 01.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అధికారిక నివాసం నుంచి సాయంత్రం 03.45గంటలకు ప్రధాని కార్యాలయానికి వెళతారు.

    Read More »
  • 3 January

    అఖండ ఆల్ టైమ్ రికార్డు

    నందమూరి అందగాడు..తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో …యువరత్న బాలకృష్ణ నటించిన చిత్రం ‘అఖండ’..ఇటీవల విడుదైన ఈ మూవీ 31 రోజుల్లో నైజాంలో రూ. 20 కోట్ల షేర్ మార్క్ దాటింది. ఇది నందమూరి బాలయ్య సినీమా కెరీర్లో మొట్టమొదటి రూ.20 కోట్ల షేర్. ఇక ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.101 కోట్ల గ్రాస్ మార్క్ దాటగా.. ఇది నటసింహం కెరీర్లో ఆల్ టైమ్ రికార్డుగా సినీమా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat