నేషనల్ క్రష్ రష్మికా మందాన స్టార్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందా..?. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా..?. కొత్త సంవత్సరం సందర్భంగా ఆ హీరోతో డేటింగ్ కెళ్లిందా అంటే అవుననే అంటున్నారు సినీ క్రిటిక్స్. అసలు విషయానికి వస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రౌడీ ఫెలో ..యువస్టార్ హీరో విజయ్ దేవరకొండ( VDK), రష్మిక గోవా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా లీకైన ఓ ఫోటో ఆ …
Read More »TimeLine Layout
January, 2022
-
3 January
ఫోన్ లో I Love You చెప్పిన బాలయ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న నందమూరి అందగాడు..యువరత్న బాలకృష్ణ ఏకంగా ఒకరికి ఆన్ లైన్లో ఫోన్ చేసి మరి ఐలవ్యూ చెప్పాడు. అసలు విషయానికోస్తే ఆహాలో ప్రసారమై ‘అన్ పబుల్’ కార్యక్రమంలో హీరో రానా అడిగిన మేరకు.. బాలకృష్ణ తన భార్యకు ఫోన్లో ప్రపోజ్ చేశాడు. ‘వసూ.. ఐ లవ్ యు’ అని తన ప్రేమను వ్యక్తం …
Read More » -
3 January
సమంత బాటలో రెజీనా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేనప్పుడు హీరోయిన్లు ఎంచుకునే మార్గం ఐటెం సాంగ్స్..స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మొదలు తమన్నా వరకు అందరూ ఐటెం సాంగ్స్ లో ఆడిపాడినవారే.. తాజాగా ఇటీవల అక్కినేని కుటుంబం నుండి దూరమై…అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఐటెం సాంగ్స్ లో నటించిన చిత్రం పుష్ప..ఈ చిత్రంలోని ఊ అంటవా మావ ఊఊ అంటవా అనే పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ …
Read More » -
3 January
సంక్రాంతి బరిలో రాజశేఖర్ చిత్రం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘శేఖర్’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఈమేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వెండితెరపై సందడి చేస్తుందా.. OTT బాట పడుతుందా? అనేది తేలాల్సి ఉంది. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్ రూపొందుతోన్న చిత్రమిది.
Read More » -
3 January
Tollywood కి పెద్ద దిక్కుగా RGV
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, ఇబ్బందులపై పలువురు స్పందిస్తుండగా.. టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి కొత్త ప్రతిపాదన చేశాడు. తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పెద్ద దిక్కుగా చూడాలని ఉందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ‘మా బాస్ ఇండస్ట్రీ పెద్దగా ఉండాలి. దాన్ని చూడాలని నా కోరిక. సామీ మీరు రావాలి సామీ’ అని అజయ్ ట్వీట్ చేశాడు.
Read More » -
3 January
మెస్సీకి కరోనా
ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి కరోనా సోకింది. ఆయనతో పాటు జట్టులోని మరో ముగ్గురు ఆటగాళ్లు, సిబ్బందిలో ఒకరికి కోవిడ్ సోకిందని మెస్సీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్యారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ వెల్లడించింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్లో ఉన్నారు. ఫ్రెంచ్ కప్లో భాగంగా సోమవారం PSG తరఫున మెస్సీ మ్యాచ్ ఉంది.
Read More » -
3 January
15-18 ఏళ్లవారికి కోవాగ్జిన్ మాత్రమే
కరోనా కట్టడీలో భాగంగా దేశ వ్యాప్తంగా రేపటి నుంచి 15-18 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాష్ట్రాలకు పలు జాగ్రత్తలను సూచించారు. ఆ వయసు వారికి కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉందని, అందువల్ల వేర్వేరు టీకాలు కలవకుండా చూసుకోవాలన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ కట్టడికి ఢిల్లీ ఎయిమ్స్ సహకారంతో జనవరి 5-19 మధ్య వెబినార్లను నిర్వహిస్తామన్నారు.
Read More » -
3 January
గ్లెన్ మెక్ గ్రాత్ కి కరోనా
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వరుడ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా 4వ టెస్టు జనవరి 5న ప్రారంభం కానుంది. క్యాన్సర్ బాధితుల కోసం రాబోయే టెస్టులో గ్లెన్ మెక్ గ్రాత్ ఫండ్ రైజింగ్ డ్రైవ్ తలపెట్టాడు. కరోనా సోకడంతో ప్రస్తుతం గ్లెన్ మెక్ …
Read More » -
3 January
ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా
ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ధ్రువీకరించారు. గత ఏడాది కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు వైరస్ సోకడం ఇది రెండోసారి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.
Read More » -
3 January
ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కరోనా కేసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇది 2 వేలు ఎక్కువ. మహారాష్ట్రలో మొత్తం 11,877 కొత్త కేసులు వచ్చాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3,194 మంది వైరస్ బారినపడ్డారు. 1156 మంది కోలుకున్నారు. దేశరాజధానిలో ప్రస్తుతం 8,397 యాక్టివ్ కేసులున్నాయి. బెంగాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. 6,153 …
Read More »