TimeLine Layout

December, 2021

  • 28 December

    ఏపీ ప్రభుత్వం తీపికబురు

    ఏపీ అర్హులుగా ఉండి సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. అలాంటి 18.48లక్షల మంది అకౌంట్లలో పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు పేర్కొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకాలు అందని వారికి ఏటా జూన్, డిసెంబర్లో …

    Read More »
  • 28 December

    వంగవీటి రాధాకు 2+2 భద్రత

    ఏపీ ప్రధానప్రతిపక్ష టీడీపీకి చెందిన నేత వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు 2+2 భద్రత కల్పించాలని ఏపీసీఎం  జగన్ అధికారులను ఆదేశించారు. రెక్కీపై ఆధారాలు సేకరించి ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సూచించారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా తన దృష్టికి తీసుకొచ్చారని.. తాను ఈ విషయాన్ని సీఎం జగన్ కు వివరించినట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. రాధాకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే …

    Read More »
  • 28 December

    మల్లన్నపై కేసు నమోదు

    తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ లో కేసు నమోదైంది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదైంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పీఎస్ లో తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.

    Read More »
  • 28 December

    అందుబాటులోకి హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.ఎస్ఆర్డీపీ లో భాగంగా ఒవైసీ-మిథాని జంక్షన్లో రూ.80కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ఉ.10.30లకు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ కంచన్ బాగ్ ని పిసల్బండ్ డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ మీదగా ఎల్బీ నగర్ వరకు వెళుతుంది. దీంతో ఎస్ఆర్డీపీలో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వంతెనల సంఖ్య 13, అండర్పస్ …

    Read More »
  • 28 December

    నేటి నుండి రైతుబంధు సాయం

    తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం అమలులో భాగంగా 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమ చేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ, 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈసారి 66,61,638 మంది రైతులకు లబ్ధి …

    Read More »
  • 28 December

    తెలంగాణ రైతాంగానికి మంత్రి సింగరెడ్డి విన్నపం

    కేంద్రం ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వలపుబాణాలు విసురుకొంటున్నాయని విమర్శించారు. విత్తనాలకోసం, ఇంటి అవసరాల కోసం మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే వారి వేసుకోవచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్కు భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చని మంత్రి సూచించారు.

    Read More »
  • 28 December

    యాషెస్ టెస్టు సిరీస్ ఆసీస్ కైవసం

    ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా మూడో టెస్టులో ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘనవిజయం సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ENG 185 రన్స్ చేయగా AUS 267 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ENG 68 రన్స్కో కుప్పకూలింది. తొలి మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టి …

    Read More »
  • 28 December

    యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ చెత్త రికార్డు

    యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ టీం టెస్టుల్లో చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో ఎక్కువ ఓటములు చవిచూసిన జట్టుగా బంగ్లాదేశ్ సరసన చేరింది. 2003లో బంగ్లాదేశ్ ఆడిన 9 మ్యాచ్ 9 ఓడిపోగా 2021లో ENG 15 మ్యాచ్ 9 ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో ఆడిన చివరి 13 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక 2021లో టెస్టుల్లో ENG ప్లేయర్లు 54 సార్లు …

    Read More »
  • 28 December

    అమెరికాలో కరోనా కల్లోలం

    అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అమెరికాలో రోజువారీ కరోనా కొత్త కేసులు ఇప్పుడు 2లక్షల మార్కుకు చేరువయ్యాయి. అతి త్వరలోనే ఆ సంఖ్య తొలిసారి 5లక్షల మార్కును తాకే అవకాశం ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన డేటా ప్రకారం ప్రతిరోజూ సగటున 1,98,404 కొత్త కేసులు నమోదవుతున్నాయి.

    Read More »
  • 28 December

    ఇంగ్లండ్ క్యాంప్ లో కరోనా కలవరం

    ఇంగ్లండ్ క్యాంప్ లో మొత్తం 6 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే.. జట్టు సపోర్టింగ్ స్టాఫ్, ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే పాజిటివ్ వచ్చిందట. ప్రస్తుతానికి ఆటగాళ్లకెవరికీ వైరస్ సోకలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఓటమి ముంగిట ఇంగ్లండ్ జట్టు కొట్టుమిట్టాడుతోంది. మరి ఈ సిరీస్ కొనసాగుతుందా..? లేక రద్దవుతుందా..? వేచి చూడాలి.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat