TimeLine Layout

December, 2021

  • 27 December

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నేడు ‘రచ్చబండ’ నిర్వహిస్తానని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి నుంచి ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. తన ఫాంహౌస్లో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

    Read More »
  • 27 December

    త్వరలోనే తెలంగాణలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో వివిధ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే 60 వేల ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించగా.. అదనంగా మరో 40 వేల కొలువులు తేలనున్నట్లు సమాచారం. దీంతో 2022లో వరుస నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే శాఖలవారీగా సన్నాహాలు మొదలుపెట్టింది.

    Read More »
  • 27 December

    TBJP అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష

    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ   రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు.భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో ఉ.10-సా. 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. తొలుత ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కరోనా వల్ల ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ …

    Read More »
  • 26 December

    కన్నుల పండుగగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం

    కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల …

    Read More »
  • 26 December

    కపిల్ దేవ్ రికార్డుపై రవిచంద్రన్ అశ్విన్ గురి

    టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.

    Read More »
  • 26 December

    తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ ఫైర్

    తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కుమారుడిపై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైరయ్యారు. కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. అటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని విమర్శించారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

    Read More »
  • 26 December

    అంకుల్ అని పిలిచినందుకు యువతిని దారుణంగా..?

    ఉత్తరాఖండ్లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. తనను ‘అంకుల్’ అని పిలిచిందని 18 ఏళ్ల అమ్మాయిని.. 35 ఏళ్ల ఓ వ్యక్తి చితకబాదాడు. ఆవేశంతో ఊగిపోయిన అతడు.. విచక్షణ మరిచి అమ్మాయిని ఇష్టారీతిన కొట్టాడు. అతడి దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన ఆ అమ్మాయి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇలా, ఓ వ్యక్తిని అంకుల్ అని పిలవడం ఆ యువతి ప్రాణాల మీదకు …

    Read More »
  • 26 December

    ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల

    తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27, యాదాద్రిలో 23, భూపాలపల్లిలో 12 కుటుంబాలకు పరిహారం రిలీజ్ చేశారు.

    Read More »
  • 26 December

    ఒమిక్రాన్ గురించి Good News

    ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ పై ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఇప్పటివరకు మన దేశంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90% మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. వారికి చికిత్సలు కూడా అందించాల్సిన అవసరం లేదని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేశ్ తెలిపారు. ఒమిక్రాన్ వచ్చినా త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. కాగా, ఇప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు …

    Read More »
  • 26 December

    వడివేలుకు కరోనా

    ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలుకు కరోనా సోకింది. ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే వడివేలు లండన్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వడివేలు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat