పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది.బలమైన మార్కెట్, వ్యాపారాభివృద్ధికున్న విస్తృత అవకాశాలతో మార్స్ పెట్‌కేర్ ఇండియా రూ.500 కోట్లతో ప్లాంట్ విస్తరణకు ముందుక్చొంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు.. వేగంగా ఇస్తున్న అనుమతులు.. పారిశ్రామిక విస్తరణకు దోహదం చేస్తున్నాయి. సమర్థవంతమైన అధికార యంత్రాంగం కృషీ కలిసొస్తున్నది. పెంపుడు జంతువుల ఆహార కంపెనీ మార్స్ పెట్‌కేర్ ఇండియా సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లోని …
Read More »TimeLine Layout
December, 2021
-
17 December
తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లు నియామకం
తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు. సీఎం …
Read More » -
17 December
జీహెచ్‌ఎంసీ అప్రమత్తం-GHMC సర్కిళ్లలో ఐసొలేషన్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే కాలనీల వారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతూ మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అంతేకాకుండా 2173 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రసాయనాలు స్ప్రే చేశారు. పాజిటివ్ నమోదవుతున్న ప్రాంతాలు, …
Read More » -
17 December
హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి KTR
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మరో 248 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్‌లో నిర్మించిన 248 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. చాచా నెహ్రూనగర్‌లోని 3.35 ఎకరాల్లో రూ.19.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను నిర్మించారు. మౌలిక వసతులతో పాటు 50, 20 …
Read More » -
17 December
తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు
తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు హరితనిధిని ఏర్పాటు చేశారు. శాసనసభలో అక్టోబర్ ఒకటిన సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల నుంచి విరాళాలు సేకరించి ‘హరిత నిధి’కి నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఈ మేరకు దీనిపై ఉత్తర్వులు …
Read More » -
17 December
నేడు టీఆర్‌ఎస్ కీలక భేటీ -పార్టీ ప్రజాప్రతినిధులతో గులాబీ దళపతి కేసీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణభవన్‌లో జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనున్న ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా …
Read More » -
17 December
రాష్ట్ర నిధులతోనే కాళేశ్వరం..
ప్రతిష్ఠాత్మక బహుళదశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత వనరులతోనే నిర్మిస్తున్నదని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లోక్‌సభలో వెల్లడించారు.నిర్మాణ పనులకు ఆన్‌లైన్ టెండర్ విధానాన్ని అనుసరించిందని చెప్పారు. గురువారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాళేశ్వరానికి అనుమతులున్నాయా? ఎంత ఖర్చు చేశారు? ప్రాజె క్టు ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నకు షెకావత్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జల్‌శక్తి శాఖలోని సాగునీరు, …
Read More » -
16 December
వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments
టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.
Read More » -
16 December
వన్డే కెప్టెన్సీ మార్పుపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.
Read More » -
16 December
న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో బాంబు కలకలం
న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తికి రైలులో క్యాటరింగ్ సిబ్బంది తీరు నచ్చలేదు. ఆగ్రహానికి గురైన అతడు సోదరుడికి చెప్పడంతో.. ఆ వ్యక్తి రైలులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఫోన్ కాల్పై విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.
Read More »