తెలంగాణలో సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి.
Read More »TimeLine Layout
December, 2021
-
8 December
సీరియల్ నటి లహరి కారు బీభత్సం
సీరియల్ నటి లహరి కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో లహరి వాగ్వాదానికి దిగింది. తన భర్త వచ్చి మాట్లాడతారంటూ కారులోనే ఉండిపోయింది. గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం …
Read More » -
8 December
147 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే తొలి రోజే ఆ జట్టు కేవలం 147 రన్స్‌కు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్, స్పీడ్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే.. రోరీ బర్న్స్ క్లీన్ బౌల్డయ్యాడు. …
Read More » -
8 December
వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరం
తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే మార్గమని చెప్పారు. అందువల్ల ప్రజాప్రతినిథులు తమ పరిధిలో ఉన్న ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించారు. నగరంలోని కొండాపూర్ ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఆధునిక వసతులను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అదనపు పడకల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. …
Read More » -
8 December
సూసైడ్ మెషీన్ వచ్చేసిందిగా..?
కోరుకున్న సమయానికి.. ఎలాంటి బాధలేకుండా రెప్పపాటులో చావు వస్తే.. అంతకంటే అదృష్టం ఉంటుందా?’ తరుచూ ఈ మాటలు వినే ఉంటాం. నొప్పితెలియని, అనాయాస చావును ప్రసాదించాలని కోరుకునే వారూ కోకొల్లలు. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. నొప్పిలేని మరణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ‘సూసైడ్ మెషీన్’కు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఏమిటీ …
Read More » -
8 December
బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విలయ తాండవం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్‌లో విలయం సృష్టిస్తున్నది. ఒకే రోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కొవిడ్ పరిస్థితులపై మంత్రులతో సమీక్షించారు. వైరస్ కట్టడికి మరిన్ని …
Read More » -
8 December
దేశంలో కొత్తగా 8,439 కరోనా కేసులు
దేశంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 9,525 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 195 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరింది. ఇందులో 3,40,89,137 …
Read More » -
8 December
ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదమా..?
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీలక అంశాన్ని వెల్లడించారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ విధ్వంసకరమైంది ఏమీకాదన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం నిజమే అని, అది డెల్టా కన్నా వేగంగా విస్తరిస్తోందని, కానీ డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్న దానిపై …
Read More » -
8 December
శ్రీవారి సేవలో Uppal MlA
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, టీటీడీ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ జన్మదిన …
Read More » -
8 December
పాలేరు కాంగ్రెస్ లో ముసలం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న రాయల నాగేశ్వరరావు పై సోషల్ మీడియా వేదికగా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఏనాడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోని నాయకుల కు ఈనాడు పదవులు కట్టబెడుతున్నారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించడం లేదని …
Read More »