TimeLine Layout

November, 2021

  • 28 November

    ఓయూలోకి రావాలంటే పైసలు కట్టాల్సిందే..?

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఓయూలోకి ఇక నుంచి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే. స్టాఫ్, స్టూడెంట్లు మినహా మిగతా ఎవరు వచ్చినా పాస్ తీసుకోవాల్సిందేనని యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వాకర్స్ నుంచి నెలకు రూ.200, గ్రౌండ్ వాడుకునేందుకు రూ.500, జిమ్ వాడేందుకు రూ. 1,000 యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.

    Read More »
  • 28 November

    Carona Vaccine కోసం పరుగులెడుతున్న జనాలు.. ఇందుకే..?

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. అయితే కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్)పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలతో ప్రజలు రిస్క్ ఎందుకని టీకా కేంద్రాలకు పరిగెత్తుతున్నారు. గత 2 రోజులుగా రెండో డోసు తీసుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు.

    Read More »
  • 28 November

    జై బాలయ్య అంటున్న అల్లు అర్జున్

    హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ,స్టైల్ స్టార్  అల్లు అర్జున్ లను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బన్నీ మాట్లాడుతున్నప్పుడు ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. అందరి ప్రేమ, ఆనందం కోసం అంటూ ఆఖరిలో ‘జై బాలయ్య’ అంటూ స్పీచ్ ముగించాడు ఐకాన్ స్టార్. ‘కొవిడ్ వచ్చినా, పైనుంచి దిగి దేవుడొచ్చినా.. …

    Read More »
  • 28 November

    YSRCP ప్రభుత్వంపై నిర్మాత సురేష్ బాబు అసహనం

    ఏపీలో మూవీ టికెట్లపై  వైసీపీ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు. ‘అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమని ఆదుకుంటామని చెబుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్న ఆ సమన్వయం.. చేతల్లో కనిపించడం లేదు. అది మేము గట్టిగా ప్రయత్నించకపోవడం వల్లనా? లేకపోతే వాళ్లు మమ్మల్ని సైడ్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు’ అని చెప్పారు.

    Read More »
  • 28 November

    శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం

    ప్రముఖ తెలుగు దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని కందులపాలెంలో అనారోగ్యంతో కృష్ణారావు తుదిశ్వాస విడిచారు. కాగా ప్రస్తుతం శ్రీనువైట్ల… మంచు విష్ణుతో ‘ఢీ అండ్ ఢీ’ సినిమా చేస్తున్నారు.

    Read More »
  • 27 November

    శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి.

    శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి. మాయ‌మాట‌లు చెప్పి కోటీశ్వ‌రుల‌ను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసి ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన శిల్పా చౌద‌రీని శ‌నివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు …

    Read More »
  • 27 November

    ఏపీలో దారుణం

    Apలోని కర్నూలు జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టుకు ఓ యువతి దరఖాస్తు చేసుకుంది. కలెక్టరేట్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ యువతి నెంబర్ తీసుకుని.. ఉద్యోగం కావాలంటే చెప్పింది చేయాలని వేధించడం మొదలుపెట్టాడు. ఓ ఉన్నతాధికారితో ఏకాంతంగా గడిపితే ఉద్యోగం వస్తుందన్నాడు. అప్రమత్తమైన బాధితురాలు కాల్ రికార్డ్ చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన విచారణకు ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు.

    Read More »
  • 27 November

    నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగింది

    Ap అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ అని చంద్రబాబు వెళ్లిపోయారని విమర్శించారు. నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. సభలో బీసీలు, మైనారిటీల అంశాలతో పాటు వరద నష్టంపై చర్చించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కూడా ఓపిగ్గా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.

    Read More »
  • 27 November

    కనీస మద్దతు ధర కల్పించలేము

    దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు.. చట్టం తేవడం సాధ్యం కాదన్నారు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్. ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు ఈ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు MSPకి చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

    Read More »
  • 27 November

    పచ్చి కొబ్బరి తింటే లాభాలెన్నో..?

    పచ్చి కొబ్బరిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనితో వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుంటాయి. *పచ్చి కొబ్బరి తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. *కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. *కొబ్బరితో మొటిమలు రావడం కూడా తగ్గుతుంది. *పచ్చకొబ్బరినీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. *కొబ్బరిలో పోషకాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat