ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణ క్రియాశీల రాష్ర్టంగా ఆవిర్భవించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణలో టాటా బోయింగ్ 100వ అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివరీ వేడుక జరిగింది. ఇప్పటి వరకు 100 అపాచీ హెలికాప్టర్ల ప్యూజ్‌లేజ్ భాగాలను టాటా సంస్థ తయారు చేసింది. AH-64 అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివరీ కార్యక్రమంలో …
Read More »TimeLine Layout
July, 2021
-
23 July
‘దృశ్యం 2’ విడుదలకు ముహూర్తం ఖరారు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘నారప్ప’ రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకీ హీరోగా నటించిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘దృశ్యం 2’ మేకర్స్ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల చేయడానికి డీల్ పూర్తి చేసుకున్నారని టాక్. లేటెస్ట్‌గా ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9 లేదా సెప్టెంబర్ 10న విడుదల చేయాలని హాట్‌స్టార్ …
Read More » -
23 July
BJPకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More » -
23 July
భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని …
Read More » -
23 July
బాధపడోద్దు.. అండగా ఉంటా-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిన్న గురువారం రోజున ముంపుకు గురైన నిర్మల్ పట్టణంలోని GNR కాలనీలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. కాలనీలోని బాధితులతో మాట్లాడి ముంపు సమయంలో బాధితులు ఎదుర్కొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రకృతి విలయం …
Read More » -
23 July
గొల్ల, కురుమలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి …
Read More » -
23 July
అందరికి ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్ నిర్ణయం
పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది తన పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగతంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్‌సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా …
Read More » -
23 July
ఈ నెల 26న దళితబంధు పై సీఎం కేసీఆర్ సమావేశం
దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించనున్న దళితబంధు పథకంపై తొలి అవగాహన సదస్సు ఈ నెల 26న ప్రగతిభవన్‌లో జరుగనున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు …
Read More » -
23 July
దేశంలో కొత్తగా 35,342 కరోనా కేసులు
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. దేశవ్యాప్తంగా 38,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 483గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రికవరీ కేసులు 3,12,93,062 కాగా, యాక్టివ్ కేసులు 4,05,513గా ఉన్నాయి. వైరస్ వల్ల దేశంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 4,19,470 గా ఉన్నట్లు …
Read More » -
22 July
యువ దర్శకుడితో బాలకృష్ణ
టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్పీడు మీదున్నాడు బాలయ్య. ఈ సీనియర్ హీరోకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ సారి యువ దర్శకుడితో …
Read More »