TimeLine Layout

May, 2021

  • 24 May

    తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,242 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 19 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,53,277 కు చేరింది. మొత్తంగా 3,125 మంది మృతి చెందారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీ సంఖ్య 5,09,663 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,489 యాక్టివ్ కేసులున్నాయి.

    Read More »
  • 24 May

    కృతి సనన్ కు తప్పని ఆ కష్టాలు

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్ ‘లో సీతగా నటిస్తోంది హీరోయిన్ కృతి సనన్. ఆమె చిత్రసీమలో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా ఓ భావోద్వేగ పోస్టు చేసింది. ‘నటిని అవుతానని ఊహించలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. కొన్ని చేదు అనుభవాలు, అవమానాలు ఎదురయ్యాయి. ఇప్పటికైనా సక్సెస్ రావడం సంతృప్తిగా ఉంది. ఇష్టమైన పాత్రలు దక్కుతున్నాయి’ …

    Read More »
  • 24 May

    ఆ హీరోతో నటించాలని ఉందంటున్న సమంత

    వెండితెరపై అందంతో ఆకట్టుకునే హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్లో నెగటివ్ షేడ్స్ ఉన్న డీగ్లామరస్ పాత్ర చేసింది. ఈ ప్రాజెక్టు ప్రమోషన్లలో సామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్లో చాలా టాలెంట్ ఉందని కొనియాడింది. ఇంకా అవకాశమొస్తే రణ్ బీర్ కపూర్తో కలిసి నటించాలని ఉందని తెలిపింది. కాగా సామ్ ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, తమిల్లో ‘కాతు వాకులా రెండు కాదల్ అనే చిత్రాలు …

    Read More »
  • 24 May

    RGV ఇంట్లో విషాదం

    వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోదరుడు పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తన జీవితంలో కీలకమైన వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని RGV పలు సందర్భాలలో చెప్పారు.

    Read More »
  • 23 May

    తెలంగాణ‌లో కొత్త‌గా 3,308 క‌రోనా కేసులు

    తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. రాష్ర్టంలో కొత్త‌గా 3,308 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 21 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. 4,723 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్‌ర్టంలో ప్ర‌స్తుతం 42,959 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ 63,120 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 513, ఖ‌మ్మం జిల్లాలో …

    Read More »
  • 23 May

    తెలంగాణలో వీసీల నియామకం

    తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. …

    Read More »
  • 23 May

    విదేశీ విద్యానిధి కోసం ద‌ర‌ఖాస్తున‌కు జూన్ 15వ తేదీ వ‌ర‌కు గ‌డువు

    తెలంగాణలోని ఎస్టీ విద్యార్థుల ఉన్న‌త విద్య కోసం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ విద్యానిధి స్కీంను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి ఎస్టీ సంక్షేమ శాఖ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యానిధి కోసం ద‌ర‌ఖాస్తున‌కు జూన్ 15వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించారు. అర్హులైన విద్యార్థుల త‌ల్లిదండ్రుల సంవ‌త్స‌ర ఆదాయం రూ. …

    Read More »
  • 23 May

    ఆ స్టార్ హీరోయిన్ కూతురుతో మహేష్

    తెలుగు సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్-మహేష్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే వార్తలు వస్తుండగా.. ఒక హీరోయిన్ పూజా హెగ్దే పేరు ఫిక్స్ అయ్యింది. మరో హీరోయిన్ జాన్వీకపూర్ పేరు తెరపైకి రాగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

    Read More »
  • 23 May

    జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

    యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. తెలుగులో మరో క్రేజీ ఆఫర్ను కొట్టేసినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’కు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు. కొరటాల గత చిత్రాలకు DSP సంగీతమందించాడు.

    Read More »
  • 23 May

    పోరాటాలకు సిద్ధమవుతున్న సారా అలీఖాన్

    బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పోరాటాల కోసం సిద్ధమవుతోంది. గుర్రపు స్వారీ, విలువిద్యలో ట్రైనింగ్ తీసుకుంటోంది. అయితే, ఇదంతా ఓ చిత్రంలో పాత్ర కోసమేనట. ఇటీవల ఆమె విక్కీకౌశల్తో ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ చిత్రాన్ని ఒప్పుకుంది. ఇందులో సారా పోషించబోయే పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. అందుకే ఈ పాత్ర కోసం ఆమె కొన్ని నెలలుగా కసరత్తులు చేస్తోంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat