తెలంగాణలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రాణాలూ కోల్పోతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో నెలరోజుల్లో 20 మంది మరణించగా, 200 మందికి పైగా కరోనా సోకింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో 20 రోజుల్లో 10 మంది కరోనాకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ఇటీవల 150 మందికి కరోనా సోకగా, ఏడుగురు మరణించారు.
Read More »TimeLine Layout
May, 2021
-
9 May
సోనూసూద్ కి మద్ధతుగా హీరోయిన్
కరోనా విపత్తు వేళ సాయం చేసేందుకు బాలీవుడ్లో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్ అందరికంటే ముందుంటున్నారు. కాగా, యువ నటీమణి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. సోనూసూద్కు మద్దతుగా నిలిచారు. సోనూసూద్ ఫౌండేషన్కు విరాళమందించారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విటర్ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు.
Read More » -
9 May
మోదీకి వైసీపీ ఎంపీ లేఖ
ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12శాతానికి తగ్గించిన జీఎస్టీని సున్నా శాతం స్లాబ్లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్సులపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకూ సున్నాశాతం స్లాబు కొనసాగించాలన్న ఆయన.. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
Read More » -
9 May
ఏపీలో 20,065 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న వచ్చిన కేసులతో పోలిస్తే.. ఇవాళ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1,01,571 టెస్టులు చేయగా 20,065 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 96 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 8,615కు చేరింది. గత 24 గంటల్లో 19,272 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,87,392 యాక్టివ్ కేసులున్నాయి.
Read More » -
9 May
ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి మేఘా ముందుకు
కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను …
Read More » -
8 May
తమిళనాడులో లాక్డౌన్
ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది. లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. …
Read More » -
8 May
మరో ఐపీఎల్ ఆటగాడికి కరోనా
కివీస్ వికెట్ కీపర్.. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు టిమ్ సైఫెర్ట్ కరోనా బారిన పడ్డాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్టర్ విమానంలో భారత్ విడిచి న్యూజిలాండ్ వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో అతన్ని విమానం ఎక్కించకుండా క్వారంటైన్లోకి తరలించారు. కొవిడ్ నెగిటివ్ వచ్చాక సైఫెర్ట్ను న్యూజిలాండ్ పంపిస్తారు. ఇక ఐపీఎల్ లో …
Read More » -
8 May
పుట్ట మధు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని భీమవరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ నుంచి పుట్టా మధు కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన సతీమణి.. కొవిడ్ నుంచి కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మధు అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనేది పోలీసులు …
Read More » -
8 May
కంగనా రనౌత్ కి కరోనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.
Read More » -
8 May
లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ప్రభాస్ మూవీ
‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం లేడీ డైరెక్టర్ సుధా కొంగర… డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా సుధా.. ప్రభాస్కు ఒక సోషల్ డ్రామా కథ చెప్పారట. స్టోరీ లైన్కు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడు.. బౌండ్ స్క్రిప్ట్ విన్న తరువాత సుధా ప్రాజెక్ట్ పై తుది నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ 2023 వరకు ఇప్పటికే ఓకే చెప్పిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో …
Read More »