తెలంగాణలో కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని సీఎం కేసీఆర్ కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందజేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.రాష్ట్రంలో లాక్ డౌన్ ఎందుకు విధంచగూడదనే విషయం గురించి సీఎం లోతైన …
Read More »TimeLine Layout
May, 2021
-
7 May
తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ …
Read More » -
6 May
కరోనా చికిత్సలో తొలి 5 రోజులు గోల్డెన్ టైం..
మీకు స్వల్ప జ్వరం ఉందా? కాస్త తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కూడా ఉన్నాయా? వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఏమీ కాదులే అని లాపర్వా చేస్తున్నారా? తీరికలేని పని కారణంగా వచ్చాయని, ఎండలతో వచ్చాయని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తేలిగ్గా తీసుకుంటున్నారా? మీకు మీరుగా తీసుకునే ఈ నిర్ణయాలే అటు తరిగి ఇటు తిరిగి చివరికి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అవును.. కరోనా చికత్సలో తొలి ఐదు …
Read More » -
6 May
తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయింది -బి. వినోద్ కుమార్
కేంద్రంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు చౌదరి అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. అజిత్‌సింగ్ మరణంపై వినోద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన అజిత్ సింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, తనకు అత్యంత సన్నిహితులన్నారు. మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన …
Read More » -
6 May
ఆ వ్యాపారంలోని నమిత ఎంట్రీ
టాలీవుడ్ లోకి సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నమిత.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా నమిత థియేటర్ పేరుతో OTT వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘కొత్త నటీనటులు, దర్శకులతో పాటు ప్రతిభను చూపించే వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మా OTT ద్వారా చిన్న సినిమా నిర్మాతలకు సంబంధించి చిత్రాలను విడుదల చేయడానికి సాయం చేస్తాం’ అని నమిత తెలిపింది.
Read More » -
6 May
‘మండేలా’ రీమేక్ లో సునీల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, కమెడియన్ సునీల్.. తమిళ సినిమా తెలుగు రీమేక్లో నటించనున్నాడని తెలుస్తోంది. గత నెలలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమా నెటి ప్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ అనిల్ సుంకర.. AK ఎంటర్టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. ముందు బండ్ల గణేశ్ అనుకున్నా.. ఇప్పుడు ‘మండేలా’ …
Read More » -
6 May
ఆ మెగా హీరోపై మనసు పారేసుకున్న బుజ్జమ్మ
ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత కృతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉప్పెన షూటింగ్కి ముందు దర్శకుడు తనను కొన్ని సినిమాలు చూడమని కోరాడట. అన్నింటిలో కృతికి ‘రంగస్థలం’ బాగా నచ్చిందట. ఆ సినిమా చూశాక రామ్ చరణ్ అభిమానినైపోయానని చెప్పుకొచ్చింది. ఆయనతో ఓ సినిమా చేయాలనేది తన కోరిక అంటోంది కృతి.
Read More » -
6 May
తొలిసారిగా చైతూ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య.. తొలిసారి వెబ్ సిరీస్లో ముందుకు రానున్నాడు. చైతూ లీడ్ రోల్లో అమెజాన్ ప్రైమ్ సరికొత్త సిరీస్ రూపొందిస్తోంది. నాగచైతన్య.. తన OTT ఎంట్రీ యాక్షన్ థ్రిల్లర్తో చేయనున్నాడు. విక్రమ్ కె కుమార్.. ఈ సిరీసు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. జులైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతూతో పాటు రాధిక ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ …
Read More » -
6 May
వరుసగా మూడో రోజు పెట్రోల్ మంట
దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.
Read More » -
6 May
దేశంలో 4,12,262 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 4,12,262 కేసులు, 3,980 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,10,77,410కి చేరింది. మరణాల సంఖ్య 2,30,168కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »