ఏపీ సీఎం ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. వివరణ ఇవ్వాలని జగన్తో పాటు సీబీఐను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
Read More »TimeLine Layout
April, 2021
-
29 April
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More » -
29 April
పేదలు వైద్యానికి ఇబ్బంది పడకుండా కృషి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తాను మంజూరు చేయించిన 72 మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని …
Read More » -
29 April
సీఎం కేసీఆర్ గారికి కరోనా నెగిటీవ్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ గారి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం బుధవారం నాడు ఇసోలేషన్ లో వున్న సీఎంకు వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించగా…రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు నేడు గురువారం రానున్నాయి.
Read More » -
29 April
సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …
Read More » -
27 April
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కలిసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం, ఆచార్య జయశంకర్ విగ్రహానికి కేకే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కే కేశవరావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అకుంఠిత కార్యదీక్షతో గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని …
Read More » -
27 April
తెలంగాణలో 10వేల మార్కు దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 52 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, 2094 మంది మరణించారు. మరో 69,221 కేసులు …
Read More » -
27 April
బీజేపీ నాయకుల కళ్లిబొల్లి మాటలు నమ్మొద్దు
బీజేపీ నాయకుల కళ్లిబొల్లి మాటలు నమ్మొద్దు.. ఝూఠగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఓటర్లకు సూచించారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా లింగారెడ్డిపల్లి, రేణుక నగర్ వార్డుల్లో హరీష్ రావు ప్రచారం నిర్వహించారు.తెలంగాణకు కేంద్రం రూ. 135 కోట్లు ఇచ్చిందని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కానీ కేంద్రం తెలంగాణకు రూ. 135 ఇచ్చిన దాఖలాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో అన్ని ధరలు …
Read More » -
27 April
దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్‌కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. ఇప్పటికే భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం రోజువారీ కేసులు కాస్త తగ్గినా.. వరుసగా ఆరో రోజు 3 లక్షల కేసులు నమోదవగా.. …
Read More » -
27 April
ఐపీఎల్‌కు భారీ షాక్.. వార్నర్, స్మిత్ కూడా గుడ్‌బై!
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ కళ తప్పనుందా? ఇప్పటికే ఒక్కొక్కరుగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ లీగ్‌ను వీడి వెళ్లిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా తిరిగి వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవకాశం ఉన్నదన్న వార్తల నేపథ్యంలో అంతకుముందే ఇంటికి వెళ్లిపోవాలని ఈ ఇద్దరు ప్లేయర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్సీబీ నుంచి …
Read More »