TimeLine Layout

April, 2021

  • 26 April

    దేశంలో కరోనా మహోగ్రరూపం

    దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజులు గడిచిన కొద్దీ మహమ్మారి ఉధృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజాగా వరుసగా ఐదో రోజు సోమవారం రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 …

    Read More »
  • 26 April

    సికింద్రాబాద్‌లో తప్పిన అగ్నిప్రమాదం

    హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో  భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బన్సీలాల్‌పేట్‌ చౌరస్తాలో ఉన్న జబ్బార్‌ కాంప్లెక్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న సరుకు అంతా కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలిపారు.

    Read More »
  • 26 April

    బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి-మంత్రి హారీష్ రావు

     కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీడీ కార్మికులకు పెన్షన్‌ పథకాల్లో కేంద్రం వాటా ఒక్కపైసా లేదని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడైనా బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చరా అని …

    Read More »
  • 25 April

    తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు

    తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా  రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన …

    Read More »
  • 25 April

    తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.

    Read More »
  • 25 April

    దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

    దేశంలో కరోనా కేసులు నానాటికి రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసులు 1,69,60,172 పెరిగాయి. మరో 2,767 మంది మరణించగా, మృతుల సంఖ్య 1,92,311కు చేరింది. దేశవ్యాప్తంగా 1,40,85,110 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులున్నాయి.

    Read More »
  • 25 April

    గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్

    గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.

    Read More »
  • 25 April

    మమతా మోహన్ దాస్ రీఎంట్రీ

    దాదాపు పదేళ్ల పాటు టాలీవుడు దూరమైన అందాల నటి, గాయని మమతా మోహన్ దాస్.. మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ అమ్మడు నటించిన లాలాబాగ్ అనే మలయాళ చిత్రం.. తెలుగులోనూ డబ్ కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయనున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ టైటిల్ సాంగ్, చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోని స్పెషల్ సాంగ్తో మమత మంచి గుర్తింపు …

    Read More »
  • 25 April

    మరో వెబ్ సిరీస్ లో మిల్క్ బ్యూటీ

    లెవెన్త్ అవర్’తో డిజిటల్ తెరపై అడుగుపెట్టిన నటి తమన్నా.. మరో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిందట. దీని కోసం. ఓ యువ దర్శకుడు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు టాక్. ఇందులో మంచి కాన్సెప్ట్ పాటు కాస్త బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇది ఆహా ఓటీటీ ఒరిజినల్గా తెరకెక్కనుంది. దీనితో పాటు తమన్నా చేతిలో ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘సీటీమార్’, ‘మాస్ట్రో’ సినిమాలు ఉన్నాయి.

    Read More »
  • 25 April

    మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి

    తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి చెందారు. గత నెల బెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికే పరిమితమైన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కుంజా భిక్షం 1989-99 కాలంలో 10 ఏళ్లు బూర్గంపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్లు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat