దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. దేశంలో ఒక్కరోజే కొత్తగా.. 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి కొత్తగా 1,761 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1.80లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,31,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్లో అత్యధిక కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి.
Read More »TimeLine Layout
April, 2021
-
20 April
రవితేజ మూవీకి కరోనా బ్రేక్
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది.తాజాగా రవితేజతో ‘ఖిలాడి’ మూవీ తెరకెక్కిస్తున్న దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ఇప్పుడు ఆయనకు కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. ఖిలాడి చిత్ర షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది.
Read More » -
20 April
గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.GHMCలో గడచిన 24 గంటల్లో మరో 793 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 91,563 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More » -
20 April
దేశంలో ఐదుగురు సీఎంలకు కరోనా
కరోనావైరస్ దెబ్బకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు ఎవ్వరూ తప్పించుకోవట్లేదు. ఇప్పటివరకు దేశంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు.
Read More » -
20 April
పిల్లలు కూడా కరోనా బారిన పడకుండా ఏమి చేయాలంటే..?
సెకండ్ వేవ్ పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు నిమ్మజాతి పండ్లు, క్యారెట్లు, స్ట్రాబెర్రీ, ఆకుకూరలు, పెరుగును రోజువారీ ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్లు పట్టుకుని, నిద్ర పోకుండా ఉంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుందని అందుకే కనీసం 10 గంటల పాటు నిద్రపోయేలా చూడాలంటున్నారు. విటమిన్ డి తగిలేందుకు రోజూ అరగంట సేపు లేలేత ఎండలో ఉంచాలంటున్నారు.
Read More » -
20 April
తెలంగాణలో కర్ఫ్యూ.. ఎప్పటి నుండి అంటే..?
ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ర్టంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ …
Read More » -
20 April
టీకా వేశాక పాజిటివ్ రాదు!
వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు వస్తాయి. జలుబు చేసినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కచ్చితంగా వస్తాయి. వారు ఆస్పత్రులకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక 15 రోజుల వరకు ఎప్పుడు టెస్టు చేయించుకున్నా పాజిటివ్ అనే వస్తుంది. అలాంటి వారిని భయపడొద్దని చెప్పండి. టెస్టులు చేయించుకోవద్దని చెప్పండి. అనవసరంగా పాజిటివ్ అని భయపడొద్దు..’అంటూ వైద్య సిబ్బంది చెప్తున్నట్టుగా ఓ ఆడియో క్లిప్పింగ్ …
Read More » -
20 April
దమ్ముంటే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా : మంత్రి కేటీఆర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నా.. ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయం చేయడం సరికాదు. దమ్ముంటే అభివృద్ధిలో తమతో పోటీ …
Read More » -
20 April
తెలంగాణలో నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దాఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన …
Read More » -
20 April
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది
Read More »