ఏపీ సీఐడీ అధికారులు అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేస్తారని మంత్రి కొడాలి నాని అన్నారు చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని దళితులను మోసం చేసి రూ.500 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని భయపెట్టి 500 ఎకరాలను కారుచౌకగా కాజేసి ప్రభుత్వానికి అధిక ధరలు అమ్ముకున్నారని తెలిపారు. వాస్తవానికి అసైన్డ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ …
Read More »TimeLine Layout
March, 2021
-
17 March
ఖమ్మంలో రెండో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో ఖమ్మం జిల్లాలో రెండో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు మంగళవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.36కోట్ల వ్యయంతో 55వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించనున్నారు. ప్రత్యక్షంగా 570 మంది ఒకేసారి పని చేసుకునేలా సువిశాలమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద ప్రస్తుతం ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించగా.. సేవలు నిర్విరామంగా సాగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కృషితో తాజాగా …
Read More » -
17 March
షర్మిల పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి విధితమే. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ”తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని అన్నారు.. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్ 9న లక్షమంది సమక్షంలో …
Read More » -
17 March
కామారెడ్డి జిల్లాలో కరోనా కలవరం
తెలంగాణలో కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలోని ఆరుగురు టీచర్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల విద్యార్థినులకూ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. కానీ విద్యార్థినుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …
Read More » -
17 March
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక – కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
ఏప్రిల్ 17న జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఉప ఎన్నికలో జానారెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు మంగళవారం రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని …
Read More » -
17 March
తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు గత ఆదివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ‘హైదరాబాద్’ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా, ‘నల్లగొండ’ స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల …
Read More » -
17 March
దివంగత ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ నివాళి
తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ …
Read More » -
17 March
ఈ రోజు (17న) సీఎంలతో ప్రధాని సమావేశం… దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా?
ఇండియాలో కరోనా ఏ రేంజ్‌లో పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాగే ఊరుకుంటే కొంపలు మునుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి జరగనుంది. ఇందులో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో మోదీ తెలుసుకోనున్నారు. ఏం చెయ్యాలో చెప్పనున్నారు. ఈ సందర్భంగా… మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్లు ప్రకటించమని …
Read More » -
16 March
అద్భుత రికార్డు.. చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం
తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు కాళేశ్వరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే నీటి పంపింగ్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింప చేసింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు.. మేఘా సామర్థ్యం తోడవడంతో తెలంగాణ భూములు సస్యశ్యామంగా మారుతున్నాయి. * చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకంగా రికార్డు నెలకొల్పింది. మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి …
Read More » -
16 March
నోముల నర్సింహయ్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు
నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదు. నోముల నర్సింహయ్య వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులు. చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి …
Read More »