ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. టీడీపీ హయాంలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి.. ప్రభుత్వం మారింది గనక నైతికంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.తన రాజీనామా లేఖను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేశారు. మూడున్నరేళ్ల తన పదవీ కాలంలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా చేపట్టిన కార్యక్రమాలపై గవర్నర్‌కు మూడేళ్ల వార్షిక నివేదిక అందజేసినట్టు వివరించారు.
Read More »పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్.. నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల రక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. రాజకుమారి బుధవారం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి సంఘటనలు విస్తుగొలిపాయని అన్నారు. మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. టీవీ …
Read More »