Home / Tag Archives: ys jagan

Tag Archives: ys jagan

జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు.   శ్రీకాకుళం – ఎంఎం నాయక్   విజయనగరం – వివేక్ యాదవ్   విశాఖ – కాటంనేని భాస్కర్   తూర్పు గోదావరి – …

Read More »

జైల్లో ఖైదీలను విడుదల చేయాలని సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. కరోనా విపత్తు నేపథ్యంలో జైళ్ళలో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా సహాయక చర్యలకై రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించినందుకు అభినందనల తెలిపిన ఆయన ఒక్కో రేషన్ కార్డుకు మీరు ఇస్తానన్న వెయ్యి రూపాయల సహాయం ఏమాత్రం సరిపోదని, నలుగురు ఉన్న ప్రతి కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక …

Read More »

జగన్ నిర్ణయాలపై భారత దేశమంతా ప్రశంసలు.. తమిళ చానెళ్లలో కధనాలు

ఎప్పుడు వచ్చామో కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కడెక్కడ లాక్ డౌన్ విధించారు. దేశమంతటా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది.. ఎవరిని ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు.. ప్రతీ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అధికారులు, ప్రభుత్వాధినేతలు తమ శక్తిమేరకు ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పనిచేస్తున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా కరోనాపై …

Read More »

కరోనా విషయంలో వలంటీర్లను అభినందించిన ప్రధాని.. జయహో జగన్

వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. వారి ద్వారా ప్రజలకు సేవలు …

Read More »

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను …

Read More »

సీఎం జగన్ చొరవ: పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి

ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పోలవరం పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి ప్రాధాన్యత ఇస్తోంది. రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, లోటుపాట్లు, ముఖ్యంగా అశాస్త్రీయంగా (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ ఇంజనీరింగ్ మోడల్లోనే పోలవరంముందుకు సాగుతోంది. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ ప్రాజెక్ట్ వేగం అందుకుంది. బహుళ …

Read More »

ఏపీలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వల్ప మార్పు

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి …

Read More »

ఏపీ సీఏం జగన్ పై సాదినేని యామిని సంచలన వాఖ్యలు..వైసీపీ ఫ్యాన్స్ ఫైర్

కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఒక పారాసెటిమల్ మాత్ర చాలని ఏపీ సీఎం జగన్ చెప్పడాన్ని బీజేపీ మహిళా నేత సాదినేని యామిని తప్పుబట్టారు. కరోనాను ఎదుర్కొనేందుకు పారాసెటిమల్ మాత్ర వేసుకుంటే అది ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశముందని వ్యాఖ్యానించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అయితే వైసీపీ అభిమానులు పోషల్ మీడియాలో సాదినేని యామినిపై కౌంటర్ ఇస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ నియంత్రణ …

Read More »

ఏపీలో 6 వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం పడింది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన చేస్తామని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదని.. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.

Read More »

ఏపీలో వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ …

Read More »