లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహీల్స్ చెక్ పోస్టు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి వస్తోన్న ఆటో బలంగా ఢీకొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తోన్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే కారులోనే ఉన్న జేపీకి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. …
Read More »అదిరిపోయిన ‘రూలర్’ సాంగ్
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న.. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా.. తాజా లేటెస్ట్ చిత్రం ‘రూలర్’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.ఈ నెల డిసెంబర్ 20న ఈ సినిమా విడుల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అడుగడుగో యాక్షన్ …
Read More »సామూహిక వివాహమహోత్సవ కార్యక్రమంలో మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి నేతృత్వంలోని ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహా వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ జెడ్పీ మైదానంలో కల్యాణ మహోత్సవం జరిగింది. ఒకే ముహూర్తంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. 2012 నుంచి ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఎంపీ …
Read More »రెవెన్యూ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సత్వరసేవలు అందించేలా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 107 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. ఒక్క రెవెన్యూలోనే ఇన్నిరకాల చట్టాలు అమల్లో ఉండటంతో ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఏ చట్టం ద్వారా పరిశీలించి పరిష్కరించాలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్ట్(బీ)లో పేర్కొన్న భూ సమస్యలు చాలావరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సమస్యలకు తోడు రెవెన్యూ …
Read More »ప్రియాంక రెడ్డి హాత్యపై హీరో మహేష్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతుంది. ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సూపర్ స్టార్ …
Read More »రేపు జర్నలిస్టులు గ్రీన్ ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడానికి రాష్ట్రంలోని జర్నలిస్టులు తరలిరావాలని మీడియా అకాడమీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పిలుపునిచ్చాయి. రేపు సోమవారం ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం …
Read More »మాజీ ఎమ్మెల్యే కొడుకుపై సినీనటి సంజన పిర్యాదు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో మాదాపూర్‌లోని ఒక పబ్‌లో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో యువతులపై ఆశిష్ గౌడ్ దాడి చేసినట్లు మాదాపూర్ పీఎస్‌లో సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్, సంజన ఫిర్యాదు చేసింది. ఆశిష్‌గౌడ్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, బూతులు తిట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మద్యం మత్తులో ఆశిష్ గౌడ్ యువతులను చితకబాదినట్లు …
Read More »తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరో ముందడుగు
ఆర్టీసీ సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిని ఈ రోజు శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా సమ్మె కాలంలో మరణించిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తానని కూడా ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 97 డిపోల నుంచి ఐదుగురు …
Read More »తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంపు
తెలంగాణ రాష్ట్రఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరండని సూచించారు. అందరూ ఉద్యోగాల్లో చేరండని, హాయిగా ఉండడని చెప్పారు. ఎటువంటి షరతులు పెట్టమని, ఉద్యోగాల్లో కార్మికుల చేరండన్నారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం …
Read More »హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులుఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు. మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు …
Read More »