Home / rameshbabu (page 190)

rameshbabu

హీరోయిన్ హాన్సిక విడాకులకు కారణం ఎవరు..?

ప్రముఖ సినీ హీరోయిన్ హన్సిక ఇటీవల వ్యాపారవేత్త సోహైల్ ను మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, అతన్ని పెళ్లి చేసుకునే వరకు సీక్రెట్ గా ఉంచాలనుకున్నాము.. కానీ మీడియాకు లీక్ కావడంతో తమ ఫొటోలను షేర్ చేసినట్లు చెప్పారు. సోహైలు అప్పటికే పెళ్లి అయ్యిందని, అతను డైవర్స్ తీసుకోవడానికి తనే కారణమంటూ కొందరు వార్తలు రాశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అతని గతం తెలిసినప్పటికీ.. డైవర్స్ తీసుకోవడానికి తనకు సంబంధం లేదన్నారు.

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు – వైసీపీ ఎంపీ తనయుడు అరెస్ట్

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్ నమోదైంది. ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాఘవ్ రెడ్డిని మధ్యాహ్నం కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్ర సహా పలువురిని అరెస్ట్ చేశారు.

Read More »

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా..కారణం ఇదే..?

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఈ నెల పదిహేడో తారీఖున జరగాల్సింది వాయిదా పడింది. రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి టీచర్స్,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మరో కొత్త తారీఖును తెలియజేస్తామని తెలిపింది.

Read More »

గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు శుభవార్తను తెలిపింది. ఎస్టీ విచారణ సంఘం ఆరేండ్ల కిందట 2016లో ఇచ్చిన సిఫారసుల మేరకు వాల్మికీ,బోయ,బేడర్,కిరాతక,నిషాద్,పెద్దబోయలు,తలయారి,చుండువాళ్లు,కాయితి లంబాడాలు,భాట్ మధురాలు ,చమర్ మధురాలను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న 11.5లక్షల పోడుభూములను పట్టాలుగా గిరిజనులకు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో …

Read More »

తెలంగాణ శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈ నెల 11న నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 12వ తేదీన మండ‌లిలో డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక నిర్వ‌హించ‌నున్నారు. డిప్యూటీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్సీ బండ ప్ర‌కాశ్ ముదిరాజ్ పేరు ఖ‌రారు అయింది. బండ ప్ర‌కాశ్ ఎమ్మెల్సీగా 2021, న‌వంబ‌ర్ నెల‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. చైర్మ‌న్‌గా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే.

Read More »

ఎంసెట్ పరీక్షలకు హాజరై విద్యార్థులకు శుభవార్త

తెలంగాణలో మే 7న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ పరీక్షలకు హజరై విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్లో ఇంటర్ ఫస్టియర్ 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. సెకండియర్లో 100% సిలబస్ చదవాల్సిందేనని పేర్కొన్నారు. 2021-22లో కరోనా కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70% సిలబస్తో పరీక్షలు రాశారని.. ఎంసెట్లో కూడా అదే సిలబస్ ఉంటుందన్నారు.

Read More »

విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.

Read More »

ఈ నెల 11న హైదరాబాద్ కు అమిత్ షా

కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.

Read More »

మంత్రులు,ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.

Read More »

ప్రభాస్, కృతిసనన్ ప్రేమలో ఉన్నారా..?

పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ..డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రభాస్, కృతి ఎంగేజ్మెంట్ మాల్దీవుల్లో జరగనుందనే ప్రచారం మొదలైంది. దీనిపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘ప్రభాస్, కృతి మంచి ఫ్రెండ్స్. మాల్దీవుల్లో వారి ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తల్లో నిజంలేదు’ అని ప్రకటించింది. ఆదిపురుష్ లో వీరిద్దరూ నటిస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat