Home / rameshbabu (page 470)

rameshbabu

మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలి

ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు పిలుపునిచ్చారు.శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కోర్ట్ హాల్ నుండి మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర …

Read More »

10 ల‌క్ష‌ల‌తో పాటు అన్ని రంగాల్లో ద‌ళితుల‌కు రిజ‌ర్వేష‌న్లే ద‌ళిత బంధు ఉద్దేశం: సీఎం కేసీఆర్

తెలంగాణ‌లో ద‌ళిత బంధు కార్య‌క్ర‌మం అద్భుత‌మైన‌ద‌ని.. ఆ ప‌థ‌కం కింద ద‌ళితుల‌కు కేవ‌లం రూ.10 ల‌క్ష‌లు ఇవ్వ‌డ‌మే కాదు.. ఇదివ‌ర‌కు ద‌ళితుల‌కు లేని ఎన్నో రిజ‌ర్వేష‌న్లను ఈ స్కీమ్ ద్వారా క‌ల్పిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో సీఎం కేసీఆర్ ఇవాళ ప‌ర్య‌టిస్తున్నారు. ఈసంద‌ర్భంగా యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. ఇదివ‌ర‌కు ద‌ళితుల‌కు రాని ఎన్నో ఫెసిలిటీల‌ను …

Read More »

ప్రెసిడెన్షియల్ సూట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌, విల్లాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్‌ సూట్‌ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం జరిగింది.ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో …

Read More »

మన ఊరు – మనబడి కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు మంత్రి కే తారకరామారావు ఎన్నారైలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ …

Read More »

మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ ఏడాది కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 16 నుంచి 19 వరకు జరుగనున్న దేశంలోనే …

Read More »

 యాదాద్రి ఆలయ నిర్మాణం అద్బుతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  యాదాద్రి ఆలయాన్ని అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, …

Read More »

CM KCR పై బండి సంజయ్ ఫైర్

జనగామ సభలో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘కేసీఆర్ చెల్లని రూపాయి. బహిరంగ సభలో బీజేపీపై విమర్శలు కాదు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో.. ఏం పీకారో చెప్పాలి. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఓడిపోతాననే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు’ అని బండి ఫైర్ అయ్యారు.

Read More »

Apకి ప్రత్యేక హోదాపై కీలక అడుగు

ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.

Read More »

అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానం

తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధిస్తామన్న 2001 నాటి కేసీఆర్ ప్రకటనను గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్న సీఎం కేసీఆర్ సాహసోపేత ప్రకటనపై గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. అదే తెలంగాణ నేడు కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read More »

‘మహాన్’ లో హీరోయిన్ లేదా..?

విక్రమ్ నటించిన ‘మహాన్’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు ఎక్కడా హీరోయిన్ వాణీ భోజన్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ప్రమోషన్లలో భాగంగా వాణీ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసినా మూవీలో ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు. అయితే సినిమా రన్లైమ్ ఎక్కువ కావడంతోనే వాణీ సీన్స్ కట్ చేశారని కొందరు, మహాన్-2లో కనిపించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat