పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే? పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి ఆకుకూరలు, మునక్కాడలు, కొత్తిమీర ఎక్కువగా పెట్టాలి చిన్నారులకు ఇచ్చే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోండి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటివి ఎక్కువ అందించాలి ఫ్రూట్ యోగర్ట్, రైతా రూపంలో పిల్లలు పెరుగు తినేలా చూడండి చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్న ఎక్కువగా తినిపించకూడదు ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి
Read More »CM KCR గారి ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కృషి చేద్దాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని సూచించారు. తెలంగాణ ఆయుష్ ఫార్మాసిస్ట్ సెంట్రల్ ఫోరం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని మంత్రి హరీశ్ రావు సోమవారం కొకాపేట …
Read More »భారత ఓపెనర్ రాహుల్ మరో రికార్డు
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2007లో వసీమ్ జాఫర్ కేప్ టౌన్లో సెంచరీ బాదాడు. అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు.
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లి.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్ టాప్ నెగ్గాడు. దీంతో అజారుద్దీన్ పేరిట ఉన్న 29 సార్ల టాస్ రికార్డును కోహ్లి అధిగమించాడు. కాగా కోహ్లి టాస్ నెగ్గిన 3 30 …
Read More »పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ
ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 9 ఏళ్లపాటు క్రికెట్ కి దూరమైన టీమిండియా పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కేరళ తరపున రంజీ క్రికెట్ ఆడనున్నట్లు ట్వీట్ చేశాడు. వచ్చే రంజీ సీజన్ కోసం కేరళ క్రికెట్ బోర్డు ప్రకటించిన 24 మంది ప్లేయర్ల లిస్టులో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. రంజీల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
Read More »Junior NTR సరసన సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంతను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల ‘జనతా గ్యారేజ్ లో సామ్ హీరోయిన్ గా నటించడంతో మరోసారి ఎన్టీఆర్ …
Read More »అల్లు రామలింగయ్య స్వాతంత్ర్య సమరయోధుడు
తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అన్నాడు. ‘మా అమ్మ వాళ్ల నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్య్ర సమరయోధుడనే విషయం తక్కువమందికే తెలుసు. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారు. అందుకు 15 రోజులకుపైగా ఆయన్ని జైలులో పెట్టారు. ఈ విషయం మా కుటుంబసభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు’ అని చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ‘RRR’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చరణ్ …
Read More »నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూత
ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్ని భాషల్లో కలిపి 800లకు పైగా పాటలు పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాలను ఆలపించారు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలోని ‘పట్టుపట్టు చెయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.
Read More »సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని మరోసారి స్పందించాడు. ‘వకీల్సాబ్ సినిమా అప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చుంటే బాగుండేది. ఈ సమస్యే మొదలయ్యేది కాదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకమత్యం లేదు. సినిమా టికెట్ల రేట్లపై ఇదివరకు నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారు. సమస్య అనేది నిజం. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read More »వంగవీటి రాధ హత్యకు రెక్కీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన నేత వంగవీటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని, రెక్కీ నిర్వహించారని అన్నారు. తనను చంపాలని చూసినా భయపడనని, దేనికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని, వంగవీటి రంగా ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కృష్ణా జిల్లా చిన్నగొన్నూరులో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ …
Read More »