కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు గారు కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయని, ఆ వేరియంట్ పట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్‌రావు శుక్రవారం …
Read More »తెలంగాణలో కొత్తగా 177కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,219 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 177 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు వైరస్ తో మరణించారు. మొత్తం 190 మంది కోలుకున్నారు.మొత్తం కేసుల సంఖ్య- 6,80,251 .మరణించిన వారి సంఖ్య – 4,018. ప్రస్తుతం యాక్టివ్ కేసులు – 4,470.మొత్తం ఒమిక్రాన్ కేసులు- 38
Read More »తెలంగాణకు మరో ఘనత
దేశంలో గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ వరుసగా రెండో ఏడాది నెం.1 స్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఆడిటింగ్ను 100శాతం పూర్తి చేసింది. 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై 25శాతం గ్రామాలు తాము చేసిన నిధుల ఖర్చులను ఆన్లైన్లో ఉంచాలని కేంద్రం ఇటీవల ఆదేశించగా.. గడువు కంటే ముందే తెలంగాణ 100% ఆడిటింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత 72%తో తమిళనాడు, 60%తో ఏపీలో 2, 3 …
Read More »TSRTC మహిళా కండక్టర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కండక్టర్లకు TSRTC శుభవార్త చెప్పింది. మహిళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని అధికారులను MD V.C.సజ్జనార్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి 8 తర్వాత డ్యూటీలు వేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ తెలిపారు.
Read More »ఇక నుండి దళితబంధు ఎంపిక వాళ్ల చేతుల్లోనే
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే లకు అప్పగించనుంది. తొలి ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10 లక్షలు ఇవ్వనుండగా.. హుజురాబాద్ నియోజకవర్గం మినహా మిగతా చోట్ల ఈ పథకం త్వరలోనే అమలు చేయనుంది. …
Read More »‘Rx 100’ కాంబో మళ్లీ వస్తోందా..?
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘Rx 100’ కాంబో వస్తోందా..?..ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ – పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘Rx 100’. బోల్డ్ కంటెంట్‌తో రొమాంటిక్ లవ్‌స్టోరిగా వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు దర్శకుడు అజయ్ భూపతి..హీరోహీరోయిన్లు కార్తికేయ …
Read More »వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ గిప్ట్
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గిఫ్ట్ పంపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మూడేళ్ళ తర్వాత పవన్ రీ ఎంట్రీ మూవీకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించారు. ఇది ఆయనకి దర్శకుడిగా మూడవ సినిమా. గత చిత్రాలు భారీ సక్సెస్ కాకపోయినా మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి …
Read More »దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూత
దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1961లో మలయాళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాను సేతుమాధవన్ డైరెక్ట్ చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Read More »త్వరలో బంగార్రాజు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,మన్మధుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య లీడ్ రోల్స్ పోషించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా కృతి శెట్టి సందడి చేయనుంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు కొనసాగింపీ …
Read More »Cricket బెట్టింగ్ ని చట్టబద్ధం చేయాలి- రవిశాస్త్రి
పన్ను పరంగా చూస్తే బెట్టింగ్.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుందని, భారతదేశంలో బెట్టింగ్ ని చట్టబద్ధం చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒక మీడియా కార్యక్రమంలో బెట్టింగ్ పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగాన్ని ఎంతగా అణచివేయాలని చూసినా కుదరదని అన్నాడు. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న మార్గమిదే అని రవిశాస్త్రి చెప్పాడు.
Read More »