Home / CRIME (page 79)

CRIME

కడపలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్‌ పరారు..!

కడప నగరంలోని చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడపకు చెందిన వినయ్‌కుమార్‌ రెడ్డి అనే రౌడీషీటర్‌పై పలు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల కింద పోలీసులు ఓ హత్య కేసులో వినయకుమార్‌రెడ్డిని అరెస్టు చేసి జిల్లా కేంద్ర కారాగారానికి …

Read More »

రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!

గాలివీడు మండలంలోని గోపనపల్లె గ్రామ పంచాయతీ సి.పురం వాండ్లపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు నల్లా బత్తిన బోడ్రెడ్డి (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలాగే ఆయన మనవరాలు రోహితారెడ్డి (6) మృతి చెందగా, భార్య జానికమ్మకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… బోడ్రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లులో ఉన్న తన కుమార్తె, అల్లుడు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి గాలివీడుకు మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. ఆయనతోపాటు భార్య జానికమ్మ, …

Read More »

హైదరాబాద్‌ లో ఓ కాంప్లెక్స్ పై నుంచి దూకిన యువతి..వీడియో వైరల్

హైదరాబాద్‌ నగరంలోని అబిడ్స్‌ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పది అంతస్థులున్న మయూరీ కాంప్లెక్స్ పై నుంచి ఓ యువతి కిందికి దూకింది. తల పగలడంతో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే అమ్మాయి మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టాగ కాచిగూడకు చెందిన యువతి(18)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నీట్‌ పరీక్షలో అర్హత సాధించకపోవటంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య …

Read More »

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడ్డ బస్సు..!

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. థెయాగ్‌ వద్ద ప్రమాదవశాత్తు హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు టిక్కర్‌ ప్రాంతం నుంచి సిమ్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు …

Read More »

అన్నపూర్ణ స్టూడియోలో హత్య..!

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియోలో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఎవరైనా హత్యచేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి …

Read More »

ఆళ్లగడ్డలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో దాడి..హైటెన్సన్

వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధికార టీడీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. వైసీపీ వర్గీయులపై మంత్రి అఖిలప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారు. పొలం పంచాయితీ ఉందని మాట్లాడటానికి రావాలంటూ వైసీపీ నేతలు కేఈ శ్రీనివాస్ గౌడ్‌ను, అతడి సోదరులను కొందరు టీడీపీ నేతలు పిలిపించారు. వైసీపీ నేతలు వారు చెప్పిన చోటుకు రాగానే టీడీపీ వర్గీయులు కర్రలు, …

Read More »

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి..!

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. 40 మంది ప్రయాణికులతో కరీంనగర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. బస్సులో చిక్కుకున్న …

Read More »

అంతర్జాతీయ క్రికెటర్‌ తండ్రి దారుణ హత్య…!

శ్రీలంక క్రికెటర్‌ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి గురువారం అర్ధరాత్రి రంజన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రంజన్‌ ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్‌కు బయల్దేరాల్సి ఉంది. స్థానిక రాజకీయవేత్త అయిన రంజన్‌పై కొలంబో శివారు …

Read More »

చిత్తూరు లో ..11 ఏళ్ల బాలికపై 5 మంది మైనర్ల్ అత్యాచారం..

ఏపీలో అత్యంత దారుణంగా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో అతి దారుణంగా బాలికపై అత్యాచారం ఘటన మరవకముందే ..చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక భగత్ సింగ్ కాలనీలో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ల అత్యాచారం చేశారు. డబ్బులు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల బాలుడు ఆ బాలికను లొంగ దీసుకున్నాడు. అతడు లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat