సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివాహా ఏర్పాట్లను సంబంధిత అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించారు. సోమవారం వరుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్‌రెడ్డి వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు వరుడి బంధువులు ఏర్పాట్ల పర్యవేక్షణలో …
Read More »తెలంగాణలో కొత్తగా 205కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 551 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. ఇందులో 2,77,304 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 6231 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 4136 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల మరో ఇద్దరు మరణించడంతో …
Read More »తెలంగాణలో హరితహారంతో అడవులకు పూర్వవైభవం
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కల సాకారమవుతున్నది. హరిత తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం సత్ఫలితాలనిస్తున్నది. అంతరించిపోతున్న అడవులు తిరిగి ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో చేపట్టిన బ్లాక్ ప్లాంటేషన్‌తో ఈ ఐదేండ్లలో సుమారు 17వేల ఎకరాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. దాదాపు 68.81 లక్షల మొక్కలు నాటగా ఏపుగా పెరిగి …
Read More »తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో ఆరుగురిని కమిషన్ సభ్యులుగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. సునీత భర్త లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా గోమారం సర్పంచ్‌తోపాటు శివ్వంపేట …
Read More »తెలంగాణలో రైతులు నచ్చిన పంట వేసుకోవచ్చు-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత …
Read More »నేటి నుండి రైతుబంధు
ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం …
Read More »బీజేపీ సీనియర్ నాయకుడు మృతి
బీజేపీ సీనియర్ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్ వికాస్ ఫౌండేషన్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్‌రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి …
Read More »తెలంగాణొస్తే ఏమొచ్చింది? అంటే..?
నీళ్లు ఆ గ్రామస్వరూపాన్ని మార్చివేశాయి. కరువు ఛాలయను కడిగేశాయి. ప్రజల జీవన స్థితి గతులను మార్చివేశాయి. వలసలకు అడ్డుకట్ట వేశాయి. రెండేండ్లలోనే ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోట గ్రామం. దశాబ్దాల తరబడి ఎండిపోయిన చెరువులు, నెర్రెబారిన నేలలు.. కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆ గ్రామం నేడు ఊహించనిస్థాయిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఉపాధి కోసం వలసబాట పట్టిన వారంతా తిరిగి సొంతగూడుకు చేరి …
Read More »వికారాబాద్‌లో ఘోరం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు మృతిచెందారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి దవాఖానకు తరలించగా.. మరొకరు …
Read More »ఫ్రాన్స్‌లో కొత్త రకం కరోనా కేసు నమోదు
ఫ్రాన్స్‌లో కొత్త రకం కరోనా కేసు నమోదు అయ్యింది. బ్రిటన్‌లో గుర్తించిన వేరియంట్ ఫ్రాన్స్‌లో కనిపించినట్లు అధికారులు ద్రువీకరించారు. టూర్స్ పట్టణంలోని తమ పౌరుడికే ఆ వైరస్ సోకినట్లు ఫ్రెంచ్ ఆరోగ్య శాఖ చెప్పింది. డిసెంబర్ 19వ తేదీన అతను లండన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతనిలో లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం అతను ఇంటి వద్దే స్వీయ నియంత్రణలో ఉన్నారు. ఇటీవల ఇంగ్లండ్‌లో కనిపించిన కొత్త రకం వైరస్ …
Read More »