సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంపై సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం …
Read More »నర్సింగ్ ఆఫీసర్ ను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ ను వెంటనే అరెస్టు చేయాలి..నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ !
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని జుక్కల్ గురుకుల పాఠశాల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూన్నస్టాఫ్ నర్స్ సునీత ను ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురిచేయడం చాలా భాదకర మైనా విషయం.ఆయన పెట్టే బాధలు తట్టుకోలేక సునీత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు మాత్రమే కాదు ప్రభుత్వం తక్షణమే ప్రిన్సిపాల్ ను తన విధుల నుండి సస్పెండ్ చెయ్యాలి మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న నర్సస్ అందరికి తగిన రక్షణ …
Read More »మంత్రి తలసానిని కల్సిన కలెక్టర్ శ్వేతమహంతి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరితగతిన అందే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని చాంబర్ లో మంత్రి శ్రీనివాసయాదవ్ ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్వేతమహంతి మర్యాదపూర్వకంగా …
Read More »ఆదర్శంగా నిలిచిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది
అతనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకోవాలని తలచాడు.. అతనికి కారు ఉంది..వీఐపీ దర్శనానికి అవకాశం కూడా ఉంది.. కానీ వీఐపీ కల్చర్ వద్దనుకున్నాడు..ప్రజలకు ఇబ్బంది కలగకూడదనుకున్నాడు అందుకే TSRTC బస్సు ఎక్కాడు..అతనెవరో కాదు నర్సంపేట ఎమ్మెల్యే ఉద్యమనేత శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..వీఐపీ దర్శనం వద్దు సామాన్య దర్శనం ముద్దు అనే అతని నిర్ణయం ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తుంది.. మేడారం జాతర నేపద్యంలో …
Read More »మేడారం జాతరకు సకల వసతులు
ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం బి.ఆర్.కే.ఆర్ భవన్ నుండి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, పూర్తి స్ధాయిలో …
Read More »తెలంగాణలో మరో రెండు రెవిన్యూ డివిజన్లు
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జోగిపేట,సిరిసిల్ల జిల్లాలో వేములవాడలను కొత్త రెవిన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ తెలిపింది. దీని ప్రకారం ఆయా ప్రాంతాల్లోని స్థానికులు,ప్రజాప్ర్తతినిధులు,అభ్యర్థుల నుండి అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ రెండు డివిజన్లతో రాష్ట్రంలో రెవిన్యూ డివిజన్లు డెబ్బై నాలుగుకు చేరనున్నాయి..
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఎమ్మెల్యే సతీమణి
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి గారు మొక్కలు నాటారు . వారితో పాటు కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక గారు కూడా పాల్గొన్నారు. కాంతారావు గారు ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు పినపాక నియోజకవర్గాన్ని మొక్కలు నాటి , రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని …
Read More »మేడారం జాతరకు రెడీ అవుతున్నారా.. ఆర్టీసీ బస్సు ఛార్జీల వివరాలివిగో..!
మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా.. అక్కడికి వెళ్లాలనుకునేవారి కోసం బస్సు ఛార్జీల వివరాలను ప్రకటించింది.ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’. మేడారంలో జరిగే …
Read More »మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం..!
హైదరాబాద్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్‌లో మంత్రి హెలికాఫ్టర్ సేవలు ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు వరకు సేవలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి …
Read More »ఆ వార్తలు అవాస్తవం- మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారని గత కొద్ది రోజుల నుంచి మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తున్నాను.. పని చేస్తానని జూపల్లి ఉద్ఘాటించారు. తనంటే గిట్టని కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమదంతా టీఆర్‌ఎస్ కుటుంబమేనని …
Read More »