తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ పరిధిలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పఠాన్ చెరులో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ మాట్లాడుతూ” నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పఠాన్ చెరులో ఎడ్యుకేషన్ హబ్ తయారు చేశారు.పిల్లలు ఆడుకోవడానికి …
Read More »జంతు సంరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం.. మాజీ ఎంపీ కవిత
జంతు సంరక్షణకు పూర్తి సహకారం అందిస్తామని మాజీ ఎంపీ కవిత అన్నారు. చేవెళ్లలోని శంకరపల్లి మండల పరిధిలోని మిర్జాగూడలో రైట్ టు ఎనిమల్ సాంక్చుయరీ (వివిధ పక్షులు, జంతువులకు ఆశ్రయం ఇచ్చేది) కవిత ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణ పశు సంవర్ధక శాఖ సహకారంతో నాంపల్లిలో, జబి ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయించి, ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తద్వారా దేశంలో …
Read More »డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కేసీఆర్‌కే సాధ్యం..!!
యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతోందని, ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లుభవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం రాఘవాపూర్ గ్రామంలో నిర్మించిన రెండుపడకల గృహాల సముదయాన్ని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి ప్రశాంత్ …
Read More »త్వరలో నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్..?
పసుపు బోర్డు సాధనలో విఫలమైన బీజేపీ ఎంపీ అరవింద్ రాజీనామా చేయబోతున్నారా..త్వరలో నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్ రానున్నాయా…ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామల నేపథ‌్యంలో నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్ వచ్చే సూచనలు మెండుగానే కనిపిస్తున్నాయి. లోకసభ తనను ఎన్నికల్లో గెలిపిస్తే పసుపు బోర్డును 5 రోజుల్లో తీసుకువస్తా అన్న హామీతో ప్రజలను, రైతులను మభ్యపెట్టి గెలుపొందిన బీజేపీ ఎంపీ అరవింద్ తర్వాత మాట మార్చాడు. పసుపు బోర్డుపై రైతులు …
Read More »సమత ఇంట మరో విషాదం..!!
రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటూర్ గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సమత మామ ఎల్లయ్య (65) గుండెపోటుతో నిన్న ఖానాపూర్ మండలం గోసంపల్లెలోని తన ఇంట్లో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఎల్లయ్య సమతపై జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబీకులు చెబుతున్నారు. సమత ఘటన జరిగిన నాటి నుండి దిగాలుగా ఉండేవాడని …
Read More »పేదల కోసమే డబుల్‌బెడ్‌రూం ఇండ్లు..!!
పేదల కోసం డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇండ్లులేని పేదలు ఉండొద్దన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవపూర్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎర్రబెల్లి డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రులు ఇండ్ల పట్టాలను …
Read More »పేరిణి నృత్యానికి జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలి..!!
కాకతీయుల కాలం నాటి పేరిణి నృత్యకళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని రాష్ట్ర క్రీడీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యులు, సీసీఆర్‌టి స్పషల్ ఆఫీసర్ డా. తాడేపల్లిని కోరారు. ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో తాడేపల్లి భేటీ అయ్యారు. డిసెంబరు 22న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగే ప్రముఖ యక్షగాన కళాకారులు, సినీ దర్శకులు వేదాంతం రాఘవయ్య శతజయంతి …
Read More »ఆయిల్‌పామ్ సాగు అధ్యయనానికి చెన్నూర్ రైతులు..!!
తెలంగాణలోనూ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ బాల్కసుమన్ అన్నారు. ధమ్మపేట, అశ్వారావుపేట, అప్పారావుపేట తదితర ప్రాంతాల్లో ఆయిల్‌పామ్‌ను అక్కడి రైతులు సాగుచేస్తున్నారు. చెన్నూరు నుంచి 1300 మంది రైతులు ఆయా ప్రాంతాల్లోఆయిల్‌పామ్ సాగును అధ్యయనం చేయడానికి ఈనెల 17వ తేదీన అక్కడికి వెళ్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్ తెలిపారు
Read More »సమక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..!
వన జాతరకు రంగం సిద్ధమవుతుంది. మేడారం జాతర తేదీలు ఖరారు కావడంతో అన్ని రకాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని పూజారుల సంఘం ప్రకటించింది. అయితే జనవరి 25 నుంచే మేడారంలో సమ్మక్కసారక్క జాతర సందడి మొదలుకానుంది. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ జాతర …
Read More »మిషన్ భగీరథ గొప్ప పథకం..!!
మిషన్ భగీరథ గొప్ప పథకం అని హడ్కో సీఈవో రవికాంత్ ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం కోదండ పురం గ్రామంలో భగీరథ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను రవికాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు ఘనస్వాగతం పలకగా అనంతరం ఆర్‌డ్యబ్లూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఇంటింటికి సురక్షిత జలాలను అందించే భగీరథ గొప్ప పథకం అన్నారు. ఈ …
Read More »