తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణ పురం హాజరత్ నాగులమీరా మౌలాచాంద్ దర్గా ఉర్సు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉర్సు నిర్వహణ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ముస్లింలు వేల సంఖ్యలో హాజరై భక్తి శ్రర్థలతో దర్శించుకున్నారు. మంగళవారం ముగింపు వేడుకలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఖందిల్ ఎత్తుకుని స్వయంగా తీసుకెల్లారు. ఉర్సు వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత …
Read More »ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం… ఆర్టీసీ జేఏసీ పిటిషనర్‌పై మండిపడింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చనిపోయారని అనడానికి ఆధారాలు ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల్ని డిస్మిస్ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు తలమానికం..మంత్రి కేటీఆర్
దేశ రాజధాని ఢిల్లీలో క్రిసిల్స్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రాక్చర్ కాంక్లేవ్ – 2019 సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైన గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ సుపరిపాలన అందించాం. ప్రజల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా పాలసీలను రూపొందించాం. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను …
Read More »లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగం..మాజీ ఎంపీ వినోద్
ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి విశిష్టత ఉందని, లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ లా కాలేజీలో జరిగిన ‘ 70 వసంతాల భారత రాజ్యాంగం ‘ అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలిచిందని అన్నారు. …
Read More »మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా రోడ్ల నిర్మాణ ప్రణాళిక.. మంత్రి ఎర్రబెల్లి
ప్రతి ఆవాసానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా రోడ్ల నిర్మాణ ప్రణాళిక ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పీఎంజీఎస్‌వై రోడ్ల ప్రతిపాదనల తయారీపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం సమీక్ష …
Read More »ఎమ్మెల్యే రోజాకి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన భానుశ్రీ
ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి భాను శ్రీ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు …
Read More »రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి..సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” మాతృభాష …
Read More »వినోద్ కుమార్ కు ఘనంగా సన్మానం
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో భేటీ అయిన బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు. గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ …
Read More »ఈ నెల 28న టీ క్యాబినేట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని క్యాబినేట్ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో భేటీ కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై.. ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించిన నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలా..?. వద్దా..?. ఆర్టీసీ …
Read More »బ్రేకింగ్..ఆర్టీసి కార్మికుల సమ్మె విరమణపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ..!
52 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముగిస్తున్నట్లు, రేపటి నుంచి కార్మికులు విధుల్లో చేరాల్సిందగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ఎండీ సునీల్ శర్మ స్పందించారు. రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు సునీల్ శర్మ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు …
Read More »