వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మేయర్ గుండా ప్రకాష్, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన విద్య, వైద్యానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. గ్రంధాలయాన్ని అన్ని విధాలుగా …
Read More »ఓర్వలేకే ప్రభుత్వంపై విమర్శలు..మంత్రి తలసాని
మన దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇవాళ ఆయన యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత …
Read More »ప్రకృతి, అడవులను కాపాడుకుంటేనే మానవ మనుగడ..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రకృతి, పర్యావరణాన్ని కలుషితం చేసి, రక్షిత చర్యలు చేపట్టడం కంటే, ఉన్న అడవులు, నీటి వనరులను యధాతథంగా కాపాడుకోవటమే మంచిదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, యూఎస్ ఎయిడ్, కేంద్ర,రాష్ట్ర అటవీ అధికారులతో కలిసి తెలంగాణలో ఫారెస్ట్ ప్లస్ 2.0ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అటవీ అభివృద్ధితో పాటు …
Read More »శాస్త్ర సాంకేతిక రంగాలతోనే సామాజిక, ఆర్ధిక పురోగతి..!!
ఏ దేశమైన, ఏ ప్రాంతమైనా సర్వతోముఖ అభివృద్ధి సాధించాలంటే శాస్త్ర సాంకేతిక పరమైన అంశాల పై అవగాహన, శాస్త్రీయ దృక్పథం ఎంతో అవసరమని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆద్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి మెంటరింగ్ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయ్యారు. …
Read More »హైదరాబాద్ లో అమెరికా క్యాన్సర్ ఆసుపత్రి
ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కోసం అమెరికా ఆంకాలజీ నెట్ వర్క్ ప్రతినిధుల బృందం బుధవారం హైదరాబాద్ లో పర్యటించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై చర్చించారు. ఆ తరువాత బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన …
Read More »గిరిజన యువతకు స్వయం ఉపాధికి చర్యలు..మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన సహకార సంస్థ(జీసీసీ)ను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు జీసీసీ ఉత్పత్తులను మరిన్ని పెంచాలని, నాణ్యతలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ , స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. జీసీసీ పనితీరు, భవిష్యత కార్యాచరణపై గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ బుధవారం దామోదర …
Read More »మంత్రిని ఇంటర్వూ చేసిన హిమాన్ష్
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు. తన స్కూల్ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.
Read More »పలు రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఫార్మా, ఐటి, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో సమావేశమైనది. ఈ సమావేశంలో …
Read More »మీకు అండగా నేను ఉంటా ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్దిదారులకు రూ. 14లక్షల 50వేల రూపాయల చెక్కులను హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణకు గుర్తింపు
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతోనే గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందుకున్న మంత్రి ఎర్రబెల్లిని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు న్యూఢిల్లీలో బుధవారం సన్మానించారు. సీఎం …
Read More »