నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. విద్యుత్‌శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్ ఎస్పీడీసీఎల్ నోటీఫికేషన్ జారీచేసింది. 2939 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ లైన్‌మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower.com కు లాగినై తెలుసుకోవచ్చు. హుజూర్ నగర్‌లో ఉపఎన్నికలు ఉన్నందున సూర్యాపేట జిల్లా మినహాయించి అన్ని …
Read More »రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలు ఏర్పాటు..కేటీఆర్
రాష్ట్రంలోని ప్రతి నగర కార్పొరేషన్ కు విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి నగరంలో ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఉన్న వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో తొలిదశలో విపత్తు నిర్వహణ విభాగాలను ఏర్పాటు …
Read More »తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి తెలంగాణ చేనేత పంచెలు…!
శ్రీవారి బ్రహ్మోత్పవాలకు తిరుమల తిరుపతి ముస్తాబు అవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా..దేశ, విదేశాల నుండి భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. శ్రీ వేంకటేశ్వరుడు ఉత్సవమూర్తులుగా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తాడు. కాగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి తెలంగాణ రాష్ట్రం నుంచి గద్వాల ఏరువాడ జోడు పంచెలు సమర్పించడం …
Read More »తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్..మంత్రి జగదీష్ రెడ్డి
హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెల్లచెరువు మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్లనే ఇన్ని సంక్షేమ పథకాలు పురుడుపోసుకున్నాయి. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లు మంత్రిగా పని చేసింది శూన్యం. ఆంధ్రా సీఎంల వద్ద మోకరిల్లి మంత్రి పదవులు పొందిన సంస్కృతి ఉత్తమ్ కుమార్ …
Read More »నీరా పాలసీ.. ప్రత్యేక స్టాళ్ల ద్వారా అమ్మకాలు చేపడతాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో నీరా పాలసీని ప్రవేశపెట్టి ప్రత్యేక స్టాళ్ల ద్వారా అమ్మకాలు చేపడతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని టాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా తెలంగాణ వంటకాలతో పాటు నీరా అమ్మకాలను ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ద్వారా నీరాకు తగిన ప్రచారం కల్పిస్తామని కూడా తె లిపారు. తెలంగాణ సాంప్రదాయక డ్రింక్‌గా నీరాను ప్రమోట్ చేస్తామని మంత్రి తెలపారు. దశల వారీతా …
Read More »నీచరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తమ్ కుమార్ రెడ్డే..సైదిరెడ్డి
ఉత్తమ్ కుమార్ పై హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి మండిపడ్డారు. నీచరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తమ్ కుమార్ రెడ్డే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హుజూర్ నగర్ అభివృద్ధి ఏనాడూ పట్టించుకోలేదని ఫైరయ్యారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే …
Read More »రైతు బంధు, రైతు భీమా..రైతులకు వరం.. మంత్రి హరీష్
రైతు బంధు, రైతు భీమా పథకాలు రైతులకు వరమని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న హరీష్ ..మాంద్యం పరిస్థితులు ఉన్న సంక్షేమం విషయంలో ఇబ్బంది లేకుండా బడ్జెట్ లో కేటాయింపులు చేశామని తెలిపారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహణలో సంగారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో 30 రోజుల ప్రణాళిక తో …
Read More »రామగుండం ఫర్టిలైజర్ ప్యాక్టరీ పున:ప్రారంభంపైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
ప్రజలకిచ్చిన హామీ మేరకు రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరగా ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి ఎరువుల కంపెనీ …
Read More »సాగర్ కు కొనసాగుతున్న వరద
తెలంగాణ ,ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహాం వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రవాహాం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వరదప్రవాహాం ఎక్కువవ్వడంతో ఆరు క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ ఫ్లో 1.50లక్షల క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో మాత్రం అరవై ఐదు వేల క్యూసెక్కులుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులైతే ప్రస్తుతం …
Read More »బతుకమ్మ చీరెలను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలు ఎంతో సంబురంగా బతుకమ్మ వేడుకలను …
Read More »