తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దిగిపోతాడంట. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తాడంట. అని బయట ప్రచారం జరుగుతుంది. నేనేందుకు దిగిపోతాను. నాకేమి బాగానే ఉన్నాను కదా.. నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తానని” ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More »మరో పదేళ్లు సీఎం ఎవరో తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో వివాదమైన నల్లమల అడవిలోని యూరేనియం తవ్వకాలపై అనుమతుల గురించి చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలపై అనుమతులివ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వం అని తేల్చి చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని …
Read More »నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..మంత్రి కేటీఆర్ ప్రకటన…!
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న దరమిలా ఇవాళ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..ఇక నుంచి ఇవ్వబోము అని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. యురేనియం నిక్షేపాల కోసం నాగర్‌కర్నూల్- ఆమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని, యురేనియం తవ్వకాలకు …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీశ్ రావు..!!
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ రోజు జరిగిన శాసనమండలి సమావేశంలో మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. ఇందులో నిజమెంతా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు …
Read More »ఐటీ ఎగుమతులు.. తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనం..కేటీఆర్
2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి లక్షా 10 వేల కోట్ల రూపాయాలకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌లో కూడా ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ …
Read More »ఎంపీ కేశవరావుకు కేంద్రంలో కీలక పదవి.. అభినందించిన సీఎం కేసీఆర్
పార్లమెంటరీ స్థాయి సంఘాలను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఈ రోజు జాబితా ప్రకటించారు. పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె .కేశవ రావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీ లో 21 మంది లోక్ సభ సభ్యులు ,పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు …
Read More »మంచి ప్రయత్నం.. రాచకొండ పోలీసులను అభినందించిన మంత్రి కేటీఆర్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. వాహన దారులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పత్రాల పేరుతో జరిమానాలు విధించకుండా వారితో హెల్మెట్స్ కొనించాలని, మిగితా ధృవ పత్రాలు పొందేలా ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ, రాచకొండ కమిషనర్ ఆదేశాలతో.. ఈ కొత్త నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసుల చేస్తున్న ఈ ప్రయత్నం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. …
Read More »ఎడిటోరియల్ : పచ్చని అడవుల్లో భయంకర విధ్వంసం..!
ఆకాశాన్ని తాకే తూర్పు కనుమలకు, ప్రకృతి రమణీయ దృశ్యాలకు, అరుదైన వృక్షజాతులకు, కనువిందు చేసే వణ్యప్రాణులకు నెలవు…తెలుగు రాష్ట్రాల అమెజాన్‌గా పేరుగాంచిన నల్లమల అడవులు..అంతరించిపోనున్నాయా… మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందా..జీవ వైవిధ్యం దెబ్బతిని జీవ జాతులు అంతరించిపోతున్నాయా..మన నాగరికతకు మూలవాసులైన చెంచుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందా..భవిష్యత్తులో భయంకరమైన ప్రకృతి విధ్వంసం చోటు చేసుకోబోతుందా…ప్రస్తుతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల గురించి వస్తున్న వార్తలు తెలుగు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. యురేనియం …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ కౌంటర్..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులపై ప్రతిపక్షనేత భట్టి విక్రమార్కకు, సీఎం కేసీఆర్‌కు మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ జరిగి సందర్భంగా ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులపై మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. దేవాదుల, దుమ్ముగూడెంకు గత ప్రభుత్వాలు ఖర్చుచేశాయని , ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తే ఇప్పటికే 35 లక్షల ఎకరాలు పారేవంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో …
Read More »ఎంపీ బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్..!!
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. ఈ రోజు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావు పేటలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వర ప్రాజెక్టు చరిత్రలో అద్భుత నిర్మాణమనీ, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా …
Read More »