ఉప్పెన`తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి తొలి చిత్రంతోనే అందరినీ ఆకర్షించింది. అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. వరుసగా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా మరో మంచి అవకాశం కృతి తలుపు తట్టినట్టు తెలుస్తోంది. రామ్ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కృతిని వరించినట్టు సమాచారం. రామ్ హీరోగా తమిళ మాస్ డైరెక్టర్ లింగు స్వామి ఓ సినిమా చేయబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ …
Read More »TimeLine Layout
February, 2021
-
21 February
రూ.20కోట్ల ఇల్లు బుట్టబొమ్మ సొంతం..ఎవరు ఇచ్చారంటే..?
హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న పూజ మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. భారీ పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోలతో ఆడిపాడుతోంది. ఇలా రెండు భాషల సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ ఇల్లు కొనుగోలు చేసిందట. స్కైలైన్ వ్యూ ఉన్న త్రిబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను పూజ ఇటీవల సొంతం …
Read More » -
21 February
ఉప్పెన దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్
దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల …
Read More » -
20 February
ఏపీలో హైవేల కోసం రూ.4,459కోట్లు
ఏపీలో హైవేల నిర్మా ణం, మరమ్మతులు, ఆధునీకరణకు 2021-22 బడ్జెట్‌లో రూ. 4459.52 కోట్లు కేటాయించినట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. పనులు ప్రారంభమైన రహదారులకు రూ.2,070 కోట్లు, మంజూరుకానీ ప్రాజెక్టులకు రూ.130 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుకు రూ.997.94 కోట్లు, ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.1261.46 కోట్లను ప్రతిపాదించినట్టు పే ర్కొంది. కాగా, ఎన్‌హెచ్ 165పై పామర్రు-ఆకివీడు రోడ్డుకు రూ.200 కోట్లు, మడకశిర నుంచి ఏపీ-కర్ణాటక సరిహద్దు …
Read More » -
20 February
మళ్లీ కరోనా గజగజ
హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …
Read More » -
20 February
అద్భుతంగా యాదాద్రి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మహాద్భుతంగా, సువిశాలమైన స్థలంలో శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ నగరిలో ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా, భక్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి కొండపై శిల్ప కళాసౌరభంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ క్షేత్రం నిర్మాణాలను 17.32 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇందులో 4.30 ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిప్టు నిర్మించగా, పనులు …
Read More » -
20 February
స్వయం ఉపాధివైపు యువత మొగ్గు
స్వయం ఉపాధిని కోరుకునే యువతకు రాష్ట్ర ప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అభిరుచి, అనుభవం, అర్హతలున్న యువత తమ కాళ్ల మీద తా ము నిలబడేందుకు సర్కార్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా అర్హులైన యువతీ, యువకుల నుంచి సబ్సిడీ రుణా ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్ …
Read More » -
20 February
మరో మూవీతో యాంకర్ రవి…!
బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తెలుగు వారందరికీ సుపరిచితుడైన రవి హీరోగా, గౌతమి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘తోటబావి’. అంజి దేవండ్ల దర్శకుడు. ఆలూర్ ప్రకాష్‌గౌడ్, దౌలు చిన్న స్వామి నిర్మిస్తున్నారు. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 5న విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అభినేష్.బి.
Read More » -
20 February
జాజికాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?
జాజికాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ..ఏమి ఉంటాయో తెలుసుకుందాం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది . ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్ధకాన్ని తొలగిస్తుంది రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది నోటి దుర్వాసనలు కూడా తొలగుతాయి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది చర్మం ప్రకాశవంతంగా మారుతుంది దగ్గు, జలుబు, కఫం వంటి వాటి నుంచి కాపాడుతుంది.
Read More » -
20 February
తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పంచవర్ష ప్రణాళిక నిధులను ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తోందన్నారు
Read More »