తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారి వైద్యం కోసం ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌కు వారం రోజుల క్రితమే స్పందించిన ఆయన, సీఎం సహాయ నిధి నుంచి శుక్రవారం రూ.3.50 లక్షల ఆర్థికసాయం అందించారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని చిన్నబోనాలకు చెందిన వ్యవసాయ కూలీ కాశెట్టి అనిల్-సౌమ్య దంపతుల రెండున్నరేళ్ల కూతురు ఆద్యశ్రీ కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. ఒక్కగానొక్క …
Read More »TimeLine Layout
January, 2021
-
30 January
తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులకు మాత్రమే అనుమతి
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి తన కార్యాలయంలో ఉన్నతవిద్యా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కళాశాల తరగతులవారీగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని ఆదేశించారు. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను తరచూ తనిఖీచేయాలని సూచించారు. ప్రతిరోజు శానిటైజేషన్ …
Read More » -
30 January
తెలంగాణలో కొత్తగా 186కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి గం.8 వరకు కొత్తగా 186 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,306కు చేరింది. ఇక నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,598కు పెరిగింది. ఇప్పటివరకు 2,90,354 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 2,354 యాక్టివ్ కేసులున్నాయి
Read More » -
30 January
నక్క తోక తొక్కిన ప్రగ్యా
యువహీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కే ‘అంతిమ్’లో సల్మాన్ కు జోడీగా ప్రగ్యా నటించనుందని సమాచారం. కాగా ప్రస్తుతం బోయపాటి-బాలకృష్ణ మూవీలో ఈమె నటిస్తోంది
Read More » -
30 January
గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీ అహింస సత్యాగ్రహం దీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్తుందని అన్నారు.
Read More » -
30 January
తెలంగాణలో ఈ రైల్వే స్టేషన్లు మూసివేత.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీ, ఆదాయం లేని రైల్వేస్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో 29 స్టేషన్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో నవాడ్గి, అంక్షాపూర్, మారుగుట్టి, పోడూరు, మామిడిపల్లి, కట్టాలి, కట్లకుంట మేడిపల్లి, మైలారం, మహాగనాన్, కొత్తపల్లి హావేలి, చిట్టహాల్ట్, నందగాన్ హాల్లి, గేట్ కారేపల్లి, నూకనపల్లిమల్యాల్, నగేశ్‌వాడి హాల్ట్, మృట్టి హాల్ట్, వలివేడు, …
Read More » -
30 January
అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్సీ
కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు. అతి జుగుప్సాకరమైన ఘటన కర్ణాటక శాసన మండలిలో శుక్రవారం చోటు చేసుకుంది. గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు …
Read More » -
30 January
అన్ని విధాలుగా తెలంగాణ ను ఆదుకున్నది వరంగల్ జిల్లానే
వరంగల్ లోని హరిత హోటల్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డైరీ – 2021 ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నియోజకవర్గ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఉద్యోగ సంఘాల నాయకులు పరిటాల సుబ్బారావు, కారం రవీందర్ రెడ్డి, జగన్ మోహన్ రావు, సత్యనారాయణ, …
Read More » -
30 January
పెద్దపల్లి కి అత్యవసర ప్రతిస్పందన అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ” GIFT A SMILE ” లో భాగంగా తన స్వంత డబ్బులతో అందించిన అత్యాధునిక అంబులెన్స్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో అంబులెన్స్ ను గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి పెద్దమనసుతో నియోజక …
Read More » -
29 January
దుమ్ము లేపుతున్న ‘ఆచార్య’ టీజర్
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం (జనవరి 29) సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు చిత్రయూనిట్ విడుదల చేసింది.
Read More »