తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరంలాంటిదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఖమ్మం నియోజకర్గంలోని పలువురు వివిధ అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతూ ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స తీసుకున్నారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 48 మందికి రూ.19.33 లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు …
Read More »TimeLine Layout
January, 2021
-
24 January
ప్రజల గుండెలలో దేవుడిగా సోనూసూద్
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ వెళుతున్న సోనూసూద్ ప్రజల గుండెలలో దేవుడిగా కొలవబడుతున్నాడు. కడుపు కాలుతున్న వారికి ఆకలి తీరుస్తూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. సోనూ సేవలకు ఫిదా అవుతున్న ప్రజలు ఆయనకు గుడులు కట్టి మరీ పూజలు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తున్నాడు. తాజాగా గుండె …
Read More » -
24 January
“దానికి కూడా సిద్ధమే” అంటున్న ప్రియమణి
ముస్తఫా రాజ్‌ని వివాహం చేసుకోకముందు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించిన నటి ప్రియమణి. ప్రస్తుతం ‘విరాటపర్వం’ సినిమాలో భారతక్క పాత్ర చేస్తున్న ప్రియమణి వెంకటేష్ సరసన ‘నారప్ప’ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. తమిళనాట జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి పాత్ర సరికొత్తగా ఉంటుందని అంటున్నారు.తలైవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించిన ప్రియమణి …
Read More » -
24 January
దేశంలో తొలిసారిగా తెలంగాణ గిరిజన సైనిక్ స్కూల్
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల సిగలో ఒక్కొక్క పువ్వుగా రోజుకో విద్యా సంస్థ కొత్తగా వచ్చి చేరుతుంది. గిరిజన శాఖను మరింత వికసింపజేస్తున్నాయి. తెలంగాణ గిరిజన విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా, విద్యలో వారికి సమాన అవకాశాలే ధ్యేయంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ శాఖలో కొత్తగా పలు విద్యా సంస్థలు మంజూరు అవుతున్నాయి. …
Read More » -
24 January
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగు విధానం, పంటల కొనుగోలు అంశాలపై చర్చిస్తున్నారు. పంటల కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో …
Read More » -
23 January
నక్క తోక తొక్కిన యశ్
KGF పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యశ్. తన రెమ్యూనరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ‘KGF’కు. 11కోట్ల పారితోషికం తీసుకున్న ఈ కన్నడ స్టార్ ఇప్పుడు రెండో చాప్టర్ కోసం ఏకంగా 130 కోట్లను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట. అంతేకాకుండా చిత్ర లాభాల్లో వాటానూ కోరాడట. అయితే రెండో పార్ట్ కు *160 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. థియేట్రికల్ బిజినెస్ ₹200 కోట్లు దాటిపోతోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం …
Read More » -
23 January
సిరాజ్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా..?
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రాణించి అందరి ప్రశంసలు పొందిన సిరాజ్.. తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. సొంతూరు హైదరాబాద్ కు వచ్చిన ఈ పేసర్ తాజాగా BMW కారు కొన్నాడు. తాను తొలిసారి కొన్న కారు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఓ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు సొంతంగా ఖరీదైన కారు కొన్న సిరాజ కు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read More » -
23 January
తమిళ దర్శకుడితో రామ్
RED తో సంక్రాంతికి పలకరించిన రామ్ తదుపరి సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది. కొంతకాలం క్రితం ‘జిల్లా’ సినిమా తీసిన | దర్శకుడు ఆర్టీ నీసన్ తో ఓ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే నీసన్ కలిసి కథ విన్పించగా రామ్ ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Read More » -
23 January
AR రెహమాన్ వినూత్న నిర్ణయం
దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.
Read More » -
23 January
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసిన తొలి పని ఏంటో తెలుసా..?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు, ఇందులో భాగంగా హొజ్లోని అధ్యక్ష కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్లో వైట్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోడా బటనను తొలగించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ బటన్ ఏర్పాటు చేయించారు. చెక్క బాక్సుపై ఉండే ఎర్రటి బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు వెంటనే సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.
Read More »