ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రాణించి అందరి ప్రశంసలు పొందిన సిరాజ్.. తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. సొంతూరు హైదరాబాద్ కు వచ్చిన ఈ పేసర్ తాజాగా BMW కారు కొన్నాడు.
తాను తొలిసారి కొన్న కారు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఓ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు సొంతంగా ఖరీదైన కారు కొన్న సిరాజ కు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.