TimeLine Layout

January, 2021

  • 2 January

    ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

    ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కొత్త ఏడాది కానుక అందించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉద్యోగులకు శుక్రవారం ఉచిత బస్ పాస్టు అందించారు. ఈ ఉచిత బస్ పాస్లు వారి నివాస స్థలం నుంచి 25 కిలో మీటర్లలోపు ప్రయాణానికి వర్తిస్తాయి. ఈ పాస్ల వల్ల 5 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.

    Read More »
  • 2 January

    జనవరి 8 వరకు రైతుబంధు

    తెలంగాణలో అర్హులైన రైతులందరికీ ఈనెల 8వ తేదీ వరకు రైతుబంధు సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రైతుబంధు కింద 48.75 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.4,079 కోట్లు జమ చేసినట్లు వెల్లడించింది. ఈనెల 8వ తేదీ వరకల్లా 60.88 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయం అందజేస్తామని పేర్కొంది.

    Read More »
  • 2 January

    ఉత్తమ సినిమాగా జెర్సీ

    2019 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. సౌత్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా నాని ‘జెర్సీ’ నిలిచింది. ఇక ఉత్తమ నటుడిగా నవీన్ పోలిశెట్టి(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ), ఉత్తమ నటిగా రష్మిక మంధాన(డియర్ కామ్రేడ్) ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా సుజీత్(సాహో) ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ (అల వైకుంఠపురములో) అవార్డులను కైవసం చేసుకున్నారు. మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు నాగార్జునకు దక్కింది.

    Read More »
  • 2 January

    ప్రభాస్ తో సాయిపల్లవి రోమాన్స్

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో టాలీవుడ్ కి చెందిన క్యూట్ ముద్దుగుమ్మ.. బక్కపలచు భామ సాయిపల్లవి రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ అమెరికా మూవీగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేతృత్వంలో తెరకెక్కనున్న “సలార్” మూవీలో సాయిపల్లవి నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు …

    Read More »
  • 2 January

    డ్రై రన్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..?

    డమ్మీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డై రన్ అంటారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం,లోపాలను గుర్తించేందుకు డై రన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ వేయాలా? వద్దా? అని నిర్ణయించటం తదితర అంశాలను ఇందులో పరిశీలిస్తారు

    Read More »
  • 2 January

    గ్రేటర్ హైదరాబాదీలకు మరో శుభవార్త

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రస్తుతం  60 శాతం బస్సులే తిరుగుతుండగా పూర్తిస్థాయిలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి వంద శాతం బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ ఆర్టీసికి 3,750 బస్సులుండగా లాక్ డౌన్ అనంతరం కేవలం 1,650 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. రోజూ 16-17 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ …

    Read More »
  • 2 January

    దేశంలో తగ్గని కరోనా కేసులు

    దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,078 కేసులు, 224 మరణాలు 8,29,964 కరోనా టెస్టులు చేయగా 19,078 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది. నిన్న 224 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందగా మొత్తం 1,49,218 మంది ప్రాణాలు విడిచారు గత 24 గంటల్లో 22,926 మంది కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 99,06,387కు చేరింది. ప్రస్తుతం 2,50,183 …

    Read More »
  • 2 January

    తెలంగాణలో 293 కొత్త కరోనా కేసులు

    తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 2,87,108కు చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,546కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 535 మంది కోలుకోగా మొత్తం 2,79,991 మంది డిశ్చార్జయ్యారు ప్రస్తుతం 5,571 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 26,590 టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య …

    Read More »
  • 2 January

    కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

    కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ (86) కన్నుమూశారు. పంజాబకు చెందిన బూటా సింగ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన బూటా సింగ్ 8 సార్లు లోక్ సభ ఎంపీగా గెలిచారు. కేంద్రంలో హోం వ్యవసాయ, రైల్వే, క్రీడలు లాంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా.. బిహార్ గవర్నర్ గా, జాతీయ SC …

    Read More »

December, 2020

  • 30 December

    నాకు కరోనా రావచ్చు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు

    దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మెగా ఫ్యామిలీ హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. తనకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను అంటూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. కొద్దిరోజులుగా తనను …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat