TimeLine Layout

August, 2020

  • 9 August

    ఘనంగా రానా-మిహీకాల పెళ్లి.

    టాలీవుడ్ భల్లాలదేవుడు రానా ఓ ఇంటివాడయ్యాడు. రానా వివాహం తన ప్రేయసి మిహీకా బజాజ్ తో  హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో రానా తన ప్రేయసి మిహీకా బజాజ్ మెళ్లో మూడు ముళ్లు వేశాడు. కాగా, కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సెలబ్రిటీ మ్యారేజికి చాలా కొద్దిమంది అతిథులనే పిలిచారు. అల్లు అర్జున్, సమంత అక్కినేని తదితరులు పెళ్లికి …

    Read More »
  • 8 August

    మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటీవ్

    మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కేబినెట్‌ను కరోనా వణికిస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా సోకిన విషయం …

    Read More »
  • 8 August

    తెలంగాణలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు

    తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1091 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య …

    Read More »
  • 8 August

    మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా

    తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు

    Read More »
  • 8 August

    రామ మందిర నిర్మాణానికి షారూక్ రూ.5 కోట్లు ఇచ్చాడా?

    అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ విషయమై రామ మందిర్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు `.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి షారూక్ తన వంతు …

    Read More »
  • 8 August

    కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన రష్యా

    కరోనా వ్యాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనల్లో రష్యా గొప్ప పురోగతి సాధించింది. ఈ నెల 12న వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓలెగ్ గృందేవ్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ రోజు జరగనుందని తెలిపారు. దీంతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్న తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. గామలేయా సెంటర్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని, మూడో దశలో ఉందని తెలిపారు. ముందుగా వైద్య వృత్తిలో …

    Read More »
  • 8 August

    కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్‌లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నంది ఎల్లయ్య లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. …

    Read More »
  • 7 August

    ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

    ‌హైదరాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో క‌లిసి  స‌న్మానించారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ప్లాస్మా  అనేది సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాత‌ల‌కు చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు, ప్లాస్మా …

    Read More »
  • 7 August

    ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

    ఎయిర్ ఇండియా విమానానికి(IX-1344) ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద రాత్రి 7:45 నిమిషాలకు ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. విమానం రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భారీ వర్షం …

    Read More »
  • 7 August

    మరో నటి ఆత్మహత్య

    ముంబై నగరంలో వరుసగా నటీనటుల ఆత్మహత్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat