Home / MOVIES / ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

‌హైదరాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో క‌లిసి  స‌న్మానించారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ప్లాస్మా  అనేది సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాత‌ల‌కు చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు, ప్లాస్మా దానంతో చాలా మంది ప్రాణాలు కాపాడినవాళ్ల‌మవుతామ‌ని అన్నారు .రక్త‌దానం చేసేలా అభిమానుల‌ను ప్రోత్స‌హించాను. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల నుంచి  వ‌స్తున్న స‌హ‌కారంతో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని.. బ్ల‌డ్ బ్యాంక్‌కు అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్ట‌ర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నాన్నారు. ప్లాస్మాదానం చేసిన వారిని స‌త్క‌రించ‌డం సంతోషంగాఉంద‌ని సీపీ సజ్జ‌నార్ చెప్పారు.

క‌రోనా బాధితుల‌కు ప్లాస్మా ఇస్తే 99 శాంత బ‌తికే అవకాశం ఉంది. ప్లాస్మాలో ఉండే యాంటీ బాడీల వ‌ల్ల క‌రోనా నుంచి కోలుకుంటారు. ఒక‌రి ప్లాస్మా నుంచి 30 మందికి సాయం చేయొచ్చ‌ని చిరంజీవి అన్నారు.

ప్లాస్మా దానం వ‌ల్ల ర‌క్తం న‌ష్ట‌మ‌నేది ఉండ‌ద‌ని, ప్లాస్మా త‌గ్గినా 24 నుంచి 48 గంటల్లో మ‌ళ్లీ త‌యార‌వుతుంద‌న్నారు. క‌రోనా నుంచి కోలుకున్నవారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాల‌ని, అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉంటే క‌రోనాను ఎదుర్కోవ‌చ్చ‌ని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat