TimeLine Layout

July, 2019

  • 20 July

    బిగ్‌బాస్ షో లో 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్

    తెలుగు బిగ్‌బాస్ 3 సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా మిగతా పేర్లు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఆ రహస్యాన్ని గత షో పార్టిసిపెంట్ నూతన్ నాయుడు బయటపెట్టేశాడు. బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. …

    Read More »
  • 20 July

    బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లతో పార్టీ విజయానికి కృషి, గుర్తించిన జగన్

    ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా వైసీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైయ‌స్ఆర్‌ సీపీ ఆవిర్భావం నుంచి మధుసూదన్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేసి పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర …

    Read More »
  • 20 July

    కాపు కార్పొరేషన్ చైర్మన్ గా..జక్కంపూడి

    రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇవ్వబోతున్నారని సమాచారం. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడైన రాజా మొదటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. రాజా గత నాలుగేళ్ల నుంచి వైసీపీ యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.ఆయనకు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    Read More »
  • 20 July

    సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్

    తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై సిఫార్సు లేఖ లేకుండానే… సామాన్య భక్తులు సైతం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు సామాన్య భక్తులకు కేటాయించే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళం అందజేసిన భక్తులకు… వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు కేటాయించే యోచనలో ఈవో సింఘాల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి పథకం …

    Read More »
  • 19 July

    రేపటి నుంచే.. పెరిగిన ఆసరా పింఛన్లు అమలులోకి..!!

    రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పింఛన్లు అమలులోకి రానున్నాయి. పెరిగిన పింఛన్లకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందించనున్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.1000 నుంచి రూ.2016కు, దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3016కు పింఛన్లు పెరగనున్నాయి.

    Read More »
  • 19 July

    చిట్ చాట్.. బీజేపీ పై కేటీఆర్ సెటైర్లు..!!

    అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీలోని టీఆర్ఎస్‌ఎల్పీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే ఆగడం లేదని కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం 8 జడ్పీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకొందని ఆయన గుర్తు చేశారు. రెండో స్థానం కోసం …

    Read More »
  • 19 July

    సీఎం కేసీఆర్‌ తో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భేటీ..!!

    సీఎం కేసీఆర్‌ తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితుల సమస్యలు, ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ నది కాలువల వెడల్పునకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. డిండి ప్రాజెక్ట్ కింద ముంపునకు గురయ్యే మునుగోడు నియోజకవర్గ భూ నిర్వాసితులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. శివన్నగూడెం, …

    Read More »
  • 19 July

    ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించున్న పృథ్వీ

    ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా …

    Read More »
  • 19 July

    విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

    జాతీయ నూతన విద్యావిధానం 2019 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, పటిష్ఠతకు దోహదపడే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఉండేలా ముసాయిదా నివేధికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.   శుక్రవారం సచివాలయంలో విద్యారంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ …

    Read More »
  • 19 July

    సూపర్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో

    సూపర్ స్టార్ మహేష్,అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.ఇటీవలే ఈ చిత్రం నుండి ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు తప్పుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై జగపతిబాబు 33ఏళ్ల తన సినీ కెరీర్ లో మొదటిసారి వివరణ ఇచ్చారు.ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన అనిల్ రావిపూడి సినిమా నుండి నేను బయటకు వచ్చేసానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని.ఇందులో నా పాత్ర బాగా నచ్చిందని ఈ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat