టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మహాకూటమి రూపంలో జట్టుకట్టిన టీజేఎస్, సీపీఐ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో ఢిల్లీ పెద్దలు తమ మార్కు స్కెచ్చుల రుచి చూపిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. భాగస్వామ్య పార్టీల సీట్ల సంఖ్యపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేస్తుండగా వివాదాస్పదమైన కొన్ని స్థానాల విషయంలో చర్చలు ముందుకు సాగటం లేదని మిత్ర పక్షాల నేతలు అంటున్నారు. అయితే, …
Read More »TimeLine Layout
October, 2018
-
29 October
తెలంగాణ కాంగ్రెస్ కు ఏపీ సీఎం చంద్రబాబు బిగ్ షాక్..!
`మనకు పొత్తు ముఖ్యం…సీట్లు కాదు..అవసరమైతే మీరు సీట్లు వదులుకోండి. కాంగ్రెస్ నేతల నిర్ణయానికే మద్దతు ఇవ్వండి తప్ప మీరు మీ అభిప్రాయాలను వెల్లడించవద్దు“ ఎన్నికల వ్యూహ రచనల నేపథ్యంలోగత సోమవారం జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు వేసిన ఆర్డర్. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇంత ఓపెన్‌గా తన పార్టీని పణంగా పెట్టి మరీ …
Read More » -
29 October
భారీ మెజార్టీయే లక్ష్యంగా కెపి వివేకానంద…
కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ జోరు కొనసాగుతున్నది. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్ది కెపి వివేకానందతో కలిసి పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గడిచిన నెలన్నర రోజులుగా నియోజకవర్గంలో ఇంటింటికి పాదయాత్రలు, ర్యాలీలు,సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించి అందరి మద్దతును కూడగట్టారు. ఇందులో భాగంగానే ప్రచార వ్యూహానికి మరింత పదును పెట్టారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలులో …
Read More » -
29 October
తెలంగాణలో బీసీలను తరిమికొడదాం.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఓటమి భయంతోనో, తెలంగాణలో ఎక్కడికక్కడ కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతతోనో కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశిస్తున్న పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వాట్సాప్ పోస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది. బీసీలను, ముదిరాజ్ లను ఉద్దేశించి రోహిత్ రెడ్డి తీవ్రమైన భాషతో దూషించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “తాండూర్ మన అడ్డా.. బీసీలను, మహేందర్ రెడ్డిని తరిమికొడదాం” అంటూ రెచ్చగొడుతూ చేసిన …
Read More » -
29 October
వైఎస్ జగన్ కు లండన్ నుంచి కుమార్తె ఫోన్..ఏం చెప్పిందో తెలుసా
విశాఖపట్నం విమానాశ్రయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం విఐపి లాంజ్ లో కూర్చుని ఉండగా జగన్ పై గతవారంలో శ్రీనివాస రావు అనే వెయిటర్ కోడి పందేలకు వాడే కత్తితో ఆయనపై దాడి చేశాడు. దాడి చేసిన వెయిటర్ శ్రీనివాస్ ను విమానాశ్రయం భద్రతా సిబ్బంది పట్టుకుని సిఎస్ఎఫ్ఐకి అప్పగించారు. హైదరాబాదు రావడానికి జగన్ విశాఖ విమానాశ్రయానికి …
Read More » -
29 October
తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయి…కేటీఆర్
నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు. కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు అని పిలుపునిచ్చారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ మార్వాడీ సంఘాల …
Read More » -
28 October
బ్రేకింగ్ న్యూస్ …వైఎస్ జగన్ పై ముమ్మాటికీ హత్యాయత్నమే రిపోర్టులో సంచలన వాస్తవాలు
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని స్పష్టమైంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ దాడిలో వైఎస్ జగన్ మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్ జగన్ కుడివైపునకు …
Read More » -
27 October
ఢిల్లీ సాక్షిగా పరువు తీసుకున్న బాబు
సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అందరూ పాటిస్తారు. ఇక ప్రచారాన్ని ఓ రేంజ్‌లో ఇష్టపడే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …
Read More » -
27 October
కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు….కేటీఆర్
విలేకరులమంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు నిన్న ధర్మపురిలో ఎన్నికల గురించి సర్వే చేస్తుండగా వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మినిస్టర్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు. కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు. విలేకరులమని చెప్పిన వారిని స్థానిక యువకులు …
Read More » -
27 October
తెలంగాణ రాష్ట్రంతో యూరోపియన్ దేశం ఒప్పందం..
తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. ఆవిష్కరణలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తమ దేశం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఎస్టోనియా రాయబారి రిహో క్రువ్ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్ దక్కన్ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టోనియా దేశ స్టడీ అంబాసిడర్ పాయల్ రాజ్‌పాల్, వాణిజ్యం, పెట్టుబడుల సలహాదారుల …
Read More »