టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అత్యాచార ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన తనను అడ్డుకుని దూషించారంటూ చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన నేతలు అడ్డుకుని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పిచారని.. గౌరవ ప్రదమైన …
Read More »TimeLine Layout
April, 2022
-
22 April
దేశంలో ఎవరూ చేయని పనులు కేసీఆర్ చేసి చూపించారు: కేటీఆర్
దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేసి చూపించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ అని… అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ అని.. ఈ …
Read More » -
22 April
మూడు రోజుల్లో పెళ్లి.. అత్త, ఆడపడుచుకు మత్తు మందు ఇచ్చి వధువు పరార్
సినిమాలోని కక్షపూరిత సన్నివేశాన్ని తలపించే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మరో మూడురోజుల్లో పెళ్లి ఉండగా కాబోయే అత్త, ఆడపడుచుకు పెళ్లికుమార్తె టీలో మత్తు మందు కలిపి ఇచ్చేసి ఆ ఇంట్లోని డబ్బుతో ఉడాయించింది. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబంలోని వ్యక్తికి వయసు అయిపోతున్నా పెళ్లికాకపోవడంతో ఆ కుటుంబసభ్యులు ఓ మహిళను సంప్రదించారు. ఆమె రూ.2లక్షలు తీసుకుని ఆర్తిబింద్ అనే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిర్చింది. మరో మూడు …
Read More » -
22 April
రేవంత్ ఏ పార్టీలో ఉంటే అది నాశనమే: ఎర్రబెల్లి
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా గెలిచిందని.. ఇప్పుడు జీరో అయిందని టీఆర్‌ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది రేవంత్ ఒక్కడేనని విమర్శించారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని.. కాంగ్రెస్ కూడా అలాగే అవుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్ …
Read More » -
22 April
బండి సంజయ్.. ఆర్డీఎస్ ఎలా పూర్తిచేస్తావో చెప్పగలవా?: నిరంజన్‌రెడ్డి సవాల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కొన తెలియదు.. మొన తెలియదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరునెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తిచేయగలవో కాగితంపై రాసిస్తావా అని సంజయ్‌కు మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడి నుంచి నిధులు తెస్తోవో చెప్పగలవా? అని ప్రశ్నించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల …
Read More » -
22 April
ఆయనలా హామీలు చెత్తబుట్టలో పడేస్తే ఏపీ అమెరికా అవుతుందా?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని చెప్పారు. ఒంగోలులో ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’ నిధులు విడుదల చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో …
Read More » -
22 April
హగ్ చేసుకుంటే లాభాలు ఎన్నో..?
హగ్ చేసుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరొటోనిన్ అనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీంతో రిలాక్స్ అవుతాం. ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది. హైబీపీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. డిప్రెషన్, ఒత్తిడి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవుతుంది. దీంతో శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడంతో రోగనిరోధక శక్తి పటిష్టమై వ్యాధులు రాకుండా ఉంటాయి.
Read More » -
22 April
హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్)లో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం రూ.2,679 కోట్లతో ఎల్బీనగర్ (రూ.900 కోట్లు), సనత్ నగర్ (రూ.882 కోట్లు), అల్వాల్ (రూ.897)లో ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక టిమ్స్ ఉండగా.. కొత్తవాటితో HYDకు నలువైపులా నాలుగు టిమ్స్ు అందుబాటులోకి రానున్నాయి.
Read More » -
22 April
విరాళాల సేకరణలో బీజేపీ మరో రికార్డు
గత ఏడాది పార్టీలకు అందిన విరాళాల విషయంలో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రధానమైన 12 పార్టీలకు రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీ కే రూ.212 కోట్లు డొనేషన్లు అందాయి. మొత్తం విరాళాలలో ఇది 82 శాతం కావడం విశేషం. రెండో స్థానంలో రూ.27 కోట్లతో (10.45 %) జేడీయూ నిలిచింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ,ఏఐడీఎంకే, డీఎంకే, …
Read More » -
22 April
మీరు లెమన్ టీ తాగరా…?.అయితే ఇది మీకోసమే..!
మీరు లెమన్ టీ తాగరా…?. అసలు టీ కాఫీలకు దూరంగా ఉంటరా..?. అయితే లెమన్ టీ వల్ల ఏమి ఏమి లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరే లెమన్ టీ తాగడం మొదలెడతారు ఇప్పటి నుండి. మరి లెమన్ టీ వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్స్ టీ చక్కగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. *జీవక్రియలను మెరుగుపరుస్తుంది. *స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, …
Read More »